2024, సెప్టెంబర్ 25 గురువారం నాడు మజ్జాన్నం ఒంటి గంట గొడ్తున్నది. మబ్బుల రెండు గంటలకు లేసి కూరగాయలమ్మవోయిన మేం ఇద్దరాలుమగలం అప్పుడే ఇంటికి చేరుకుంటున్నం. కూడు లేదు, కుంపటి లేదు. కడుపుల పేగులు గుర్.. గుర్రుమని మొత్తుకుంటున్నయి. ఇంత సల్లవడ్దామని ఆగమాగం ఇంటికి వోతున్నం. మా ఇంటికి ఓ ఇరువై గజాల దూరంల ఉన్నం గావొచ్చు. ఎన్నడూ మా ఇంటిమొకాన రాని పోలీసులు లాఠీలు వట్టుకొని కనవడ్తున్నరు. పోలీసు జీబులు కనవడ్తున్నయి. కండ్లకు అద్దాలు వెట్టుకొని, టిక్కు, టక్కు ఏస్కొని ఉన్న అధికారులు చేతిల ఏవో పేపర్లు వట్టుకొని ఉన్నరు. టేప్ వట్టుకొని మా కొలుస్తున్నరు.
పక్కన్నే ఎర్రకలర్బ్రెష్ వట్టుకొని ఓ ‘వద్దంకుల్, వద్దంకుల్..’ అని కొడుకు గుక్కపట్టి ఏడుస్తనే ఉన్నరు. జూసిన మా పిల్లలు దగ్గరికి ఉరికచ్చి గట్టిగ అల్ముకున్నరు. వాళ్లు ఎగవోసుకుంట చెప్పే మాటలు మాకర్థమైతలేవు.
నా పేరు బొడిగె నర్సింహ. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన నాకు పదిహేనేండ్లు వడ్డయి. నాయి న బొడిగె అంజయ్య ‘నాయినా.. నేన్గూడ నీతోని తాళ్లెక్కుడు నేర్సుకుంట’ అనడిగిన. ‘నేన్ గీసిన కల్లే రోజు నేల పాలైతున్నది, నువ్వు తాళ్లెక్కి ఏం జేస్తవ్‌రా?’ అని శెప్పకుండనే ఆ పని వద్దని ఇగ లేదని పట్నం బాట వట్టిన. పట్నం వచ్చిన కొత్తల రోజుకు పది రూపాల కూలికి కల్లు కాంపౌండ్ల పనికి కుదిరిన. గడియ రికాం లేదు, గవ్వ రాకట లేదన్నట్టు.. ఎన్నేండ్లు పన్జేసినా ఎన్కేసింది మాత్రం ఏం లేదు. అది పోను ‘పిలగాడు కల్లు కాంపౌండ్ల పన్జేస్తడటనవ్వా..’ అని పిల్లనిచ్చేటందుకు గూడ ఎవ్వలు ముందు కు రాలె.
ఇగ లాభం లేదని కుట్టుమిషిన్ పన్నేర్సుకున్న. ఆ పన్జేస్తుండంగనే కొన్నిరోజులకు సువర్ణ నాకు జతయింది. కొన్ని రోజులకు మాకిద్దరు పిల్లలు గూడ వుట్టిర్రు. రెడీమేడ్ బట్టల పుణ్యమాని కుట్టుమిషిన్ పని గూడ కుంటువడ్డది. ఆ రోజుల్ల కడుపున వుట్టిన పోరగాండ్లకు కడుపు నిండా తిండివెట్టలేని పరిస్థితి. ఓ రోజు కిరాయి ఉన్న ఇంటి ఓనర్ అచ్చి ‘అచ్చే నెల కిరాయి గట్టకుంటే బయట అని బెదిరిచ్చిం డు. ఆయన మాటలు మా ఇద్దరాలుమొగల్ని ఎన్టీఆర్నగర్లోని మార్కెట్ బాట అప్పట్నుంచి ఇప్పటిదాకా దగ్గెర దగ్గెర ఇరువై ఐదేండ్లయితున్నయి గావొచ్చు అటు మిషిన్ కుట్టుకుంటనే, కూరగాయలు గూడ అమ్ముతున్నం.
నాటి నుంచి తినో, తినకనో.. పస్తులుండో, పచ్చడి మెతుకులు దినో.. కడుపు మాడ్సుకొనో, కారంతోని దినో.. కట్టవడి, శెమటోడ్చి పైసా పైసా పోగేసుకున్నం. రూపాయి రూపాయి కూడవెట్టుకున్నం. ఇల్లు లేని బతుక్కు ఇల్వలేదని అర్థమైంది. అందుకే ఎట్లనన్న పట్నంల ఓ గూడు పట్నంల గూడు కట్టుకునుడంటే ఉత్త ముచ్చటనా? ముందుగాళ్లనైతే జాగ ఆ తర్వాత గూడు నిలవెట్టుకుందామని అగ్గువకచ్చే జాగ కోసం ఎన్కులాడినం. మాకు దగ్గట్టే, మేం అనుకున్నట్టే ఓ 117 గజాల భూమి అమ్మకానికొచ్చింది. బ్యారం కుదిరింది. బయాన వెట్టి నం.
భూమి చైతన్యపురిలోని ఫణిగిరికాలనీ, సాయిబాబా మూసీ కొంచెం దూరాన, ఆ భూమి ముందునుంచే వోతది. కట్టవడ్డ పైసలు గదా? అమ్మేటోని దగ్గర అధికారు ల దగ్గరికి గూడ ఆ భూమి కాయిదాలు సూపెట్టి ‘ఈ భూమి మంచిదేనా సారు?, ముందు ముందు మాకేమ న్న ఇబ్బందైతదా?’ అనడిగితే ‘ఈ భూమిల కొర్రీలేం లెవ్వు, బాజాప్తా కొనొచ్చ’ని భరోసా ఇచ్చిండు. తతిమా పైసలు గట్టి రిజిస్ట్రేషన్ గూడ చేపిచ్చుకున్నం. ఉన్న పైసలతోని జాగ కొనుక్కున్నమంటే ఇగ ఇల్లు కట్టుకునేటందుకు పైసలెక్కడియి? సుట్టూ వెట్టుకొని ఉన్నంతల నాలు గు ఆల్సుకున్నం. ఇంటికి కనెక్షన్ ఉన్నది. కరెంటు మీటర్ గూడ ఉన్నది. పద్నాలుగేండ్ల నుంచి ఇంట్ల ఇదే తింటున్నం. ఊరికి వోయినా నాత్రి ఈ ఇంటికి రావాల్సిందే. పుశ్కివొయి అక్కడున్నా నాకు నిద్రవట్టది. మళ్ల నా ఇంట్లకొచ్చి నడుమాలుస్తనే కంటి నిండా నిద్రవడ్తది.
మా పిల్లల ఎగవోతల మజ్జన మా ఇల్లును కూలగొడ్తరనే విషయం మాకర్థమైంది. నేనో దిక్కు, మా ఇంటామె సువర్ణో దిక్కు వొయి ‘మీ బాంఛెన్ మా వెట్టకుర్రి, మా ఇల్లు కూలగొట్టకుర్ర’ని బతిలాడినం, ఆఖరికి కాళ్ల మీద గూడ వడ్డం. అయినా వాళ్ల కర్గలే. కట్టవడి కట్టుకున్న కూలగొడ్తమంటే అధికారులకు అంతే.. ఈమెను గుంజిపారేయిర్రి, ఎక్వ తక్వ జేస్తే పోలీస్‌స్టేషన్‌కు తీసుకపార్రి’ అని పోలీసాయన దబాయించిండు.
ఓ దిక్కు మేం దిక్కు గుంజిపారేసుడు. పేదోళ్లం, పైగా పెద్దోళ్లే గెలిసిన్రు. మా ఇంటికిరెడ్ మార్క్ పెట్టనే వెట్టిర్రు. అంటే.. మా ఇగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూలగొడ్తడట. ఇంటికి రెడ్ మార్క్ వడ్డ కాన్నుంచి బుక్క నోట్లెకు వోతలేదు, కంటి మీద లేదు. మా పిల్లలెక్కన్నో, మేం ఎక్కన్నో మాకే సమజైతలేదు. మార్కెట్‌కు పోవుడు లేదు, మన్ను బుక్కుడు లేదు.
పెళ్లీడుకొచ్చిన ఆడివిల్లతో సహా మమ్మల్ని రోడ్డున పడేయ్యాల్నని సీఎం రేవంత్ కంకణం గట్టుకున్నడు. కనీ, పొట్టో న్ని పొడుగోడు గొడ్తే, పొడుగోన్ని పోశమ్మ గొడ్తదట. మమ్మల్ని నాశనం జేయాల్నని జూస్తే, ఏదో రోజు వాళ్లు గూడ నాశనమైపోతరు. మా తాకుతది. పోలీసోళ్లు డీసీఎం వ్యాన్లు ‘కట్టుబట్టలతోని సామాన్లు సర్దుకొని ఈ వోర్రి, లేకుంటే బలవంతంగ గుంజిపారేస్తమ’నిబెదిరిచ్చిపోయిండ్రు. మా ఫణిగిరికాలనీల పోలీసు జీబులు తిర్గుతనే ఉన్నయి. ఎప్పుడు బుల్డోజర్లు వస్తయోనని గుండెలు గుభేల్మం టున్నయి. క్షణక్షణం భయపడుకుంట బతుకుతున్నం. సీఎం సార్.. మమల్ని ఇంతగనం ఆ బుల్డోజర్లను జప్పన పిలిపియ్యిర్రి. మేం ఇంట్ల ఉండంగనే కూలగొట్టుర్రి. ఇంటి నల్గురం మా ఇంట్లనే సచ్చిపో తం. మా ఇల్లే కూలినంక మేముంటేంది? లేకుంటేంది?
– గడ్డం సతీష్ 99590 59041