ఎటమటం – అంత సీన్ లేదు !
ఉత్తరాది వేరు. దక్షిణాది వేరు. అక్కడ వర్కవుట్ అయింది కాబట్టి ఇక్కడా అవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వచ్చే ఎన్నికలలో బీజేపీకే అధికారం అని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అలా అన్నారంటే మీ చెవిలో పెద్ద కమలం పువ్వు పెడుతున్నట్టే.

ఉత్తరాది వేరు. దక్షిణాది వేరు. అక్కడ వర్కవుట్ అయింది కాబట్టి ఇక్కడా అవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వచ్చే ఎన్నికలలో బీజేపీకే అధికారం అని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అలా అన్నారంటే మీ చెవిలో పెద్ద కమలం పువ్వు పెడుతున్నట్టే. అధికారం కాదు కదా… కనీసం రెండో స్థానం కూడా కష్టమే. తెలంగాణలో బీజేపీ తాజా పరిస్థితిపై ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని అమిత్ షా, నడ్డా ఆరా తీయగా వారు చెప్పిన మాటలు ఇవీ. కర్ణాటక పోయినా తెలంగాణ వస్తుందని మన వాళ్లు చెబుతుంటే, మీరేమో మాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారేంటి? అని అగ్రనేతలు ఇద్దరు ఆశ్చర్యపోయినట్టు సమాచారం.
కాంగ్రెస్-పీ వచ్చిందోచ్

ఆంగ్లంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో రాష్ట్ర కాంగ్రెస్‌లో అన్ని గ్రూపులు ఉన్నాయని అంటారు. తాజాగా కాంగ్రెస్-పీ (పొంగులేటి) గ్రూప్ ఒకటి ఏర్పడింది. దీనికి కాంగ్రెస్-ఆర్ (రేవంత్‌రెడ్డి) మద్దతు ఇస్తుండగా, కాంగ్రెస్-బీ (భట్టి) వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్-బీ గ్రూపునకు కాంగ్రెస్-కే (కోమటిరెడ్డి) మద్దతు ఇస్తున్నది. కాంగ్రెస్-పీ తో కాంగ్రెస్-ఆర్ జత కట్టడం సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరికి అసలు రుచించడం లేదు. దీంతో జూలై 2న ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన పోస్టర్లలో రేణుకా చౌదరి ఫొటో లేకుండా కాంగ్రెస్-పీ జాగ్రత్త పడితే, కాంగ్రెస్-బీ పోస్టర్లలో పొంగులేటి ఫొటో లేకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. కాంగ్రెస్-పీ, కాంగ్రెస్-ఆర్, కాంగ్రెస్- కే ఇవన్నీ అగ్రకుల గ్రూపులను కాంగ్రెస్-ఎం (మధుయాష్కీ) గ్రూప్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తున్నది.
నలుగురు సీఎం అభ్యర్థులు

తమ పార్టీకి కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి. మరి మీ పార్టీలకు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎవరున్నారని కాంగ్రెస్, బీజేపీలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీకి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని బీజేపీ నాయకులు మౌనంగా ఉండ గా, తమ పార్టీకి ఒకరు కాదు నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సీఎం అభ్యర్థులలో కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ముగ్గురేనని లెక్క తేలుతుండ గా, ఆ నాలుగో అభ్యర్థి ఎవరు? ఉత్తమ్‌కుమార్ రెడ్డా? జానారెడ్డ్డా? లేక కొత్తగా పార్టీలో చేరబోయే పాదయాత్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలనా? అనేది స మజ్ కావడం లేదని గాంధీభవన్ మెట్ల మీద చర్చ.
– వెల్జాల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- CM KCR
- Etala Rajender
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

