మట్టికి పూలాభిషేకం

చెట్టు నాటుతున్నావా?
లేదూ..
పిట్టకో గూడల్లుతున్నా..!
ఎండవాకిట్లో
నీడకళ్లాపి చల్లి
పూలముగ్గేస్తూ చెట్టు!
మాంత్రికుడిది కాదు
మానవుడి ప్రాణమే
చెట్టు తొర్రలో ఇప్పుడు!
మూడడుగులకో
చెట్టు నాటు
ఆరడుగులకు దూరమౌతావు..
పచ్చరంగు చీరే
ఎక్కువిష్టం
ప్రకృతి తల్లికి!
ఒక్క పచ్చరంగు
పక్కనుంటే చాలు
జీవితం ఏడురంగులు!
పచ్చని జేబురుమాలిచ్చి
కాలుష్యపు కన్నీళ్లను
తుడుచుకోమంటుంది చెట్టు..
విత్తును చెట్టుగా పెంచి
పెద్ద చేసినందుకు
మట్టికి పూలాభిషేకం!
పిచ్చి మొక్కలకూ
ఔషధగుణాలుంటాయి
కానీ మనిషికే…
వానతెచ్చిన పచ్చని
పట్టుపరికిణీ కట్టుకుని
సిగ్గుపడుతోంది నేలబాలిక
పచ్చని వాగు
పరుగులెత్తేది
రైతువేళ్ల సందుల్లోంచే..!!
చిత్తలూరి,8247432521
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

