స్థానిక ఠాణాలకే ‘సోషల్’ ఫిర్యాదులు

- అన్ని స్టేషన్లలో సైబర్ విభాగాలు
- దర్యాప్తులో వేగానికి చర్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సోషల్‌మీడియాలో వేధిస్తున్నారు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు రూ.10 వేలు కొట్టేశారు వంటి ఫిర్యాదులను ఇకపై నేరుగా స్థానిక పోలీస్స్టేషన్లలోనే చేసుకోవచ్చు. మొన్నటివరకు ఇలాంటి ఫిర్యాదులను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం ఠాణాల్లోనే స్వీకరించేవారు. అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు పనిచేస్తుండటం, దీనిపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, సైబర్ నేరాల దర్యాప్తుపై వారికి పట్టురావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నా రు. సీసీఎస్ ఆధీనంలో ఉన్న సైబర్ఠాణాపై ఒత్తిడిని తగ్గించేందుకు సైబర్ నేరాలకు సంబంధించి రూ.లక్ష లోపు నష్టం వాటిల్లే ఫిర్యాదులపై అన్ని శాంతిభద్రతల పోలీస్స్టేషన్లలోనే కేసులు నమోదుచేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో సీపీ ఆదేశాలు జారీచేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.లక్ష కంటే ఎక్కువగా నష్టపోయే బాధితులు మాత్రం సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌ఠాణాలో ఫిర్యా దు చేయాలని పోలీసులు సూచించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గితే.. దర్యాప్తులో వేగం పుంజుకొంటుందని, నేరస్థులను త్వరగా అరెస్ట్ చేసేందుకు వీలవుతుందని చెప్తున్నారు.
లోకల్ ఠాణాలకు పంపిస్తున్నాం
ఇదివరకు సోషల్‌మీడియాకు సంబంధించిన వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తదితర కేసులు సైబర్‌ఠాణాలో తీసుకునేవాళ్లం. సైబర్ కేసుల దర్యాప్తు కోసం శాంతిభద్రతల పోలీస్స్టేషన్లలో శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బంది ఉండటంతో ఇప్పుడు అన్ని ఠాణాలను సైబర్‌క్రైమ్ పోలీస్స్టేషన్లే అనుకోవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సోషల్‌మీడియా ఫిర్యాదులను లోకల్ పోలీస్స్టేషన్లకు పంపిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.
–ఏవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

