కృష్ణమ్మ తలాపున ఉన్నప్పటికీ
కుటుంబాలను సాకలేక వెతలు గతికి
వలస కూలీలుగా బతుకులు చితికి
మనిషిగా మనుగడే బెరికి
కలరు మాకు మహా నాయకులు
ప్రజల గోడు పట్టని గత దొరబాబులు
ప్రజా సేవకుల మనే ఓట్ల పీడకులు
పచ్చి రక్తం పీల్చే జలగలు
కరుణించిన మా కృష్ణ వేణమ్మ
దీనజన వేదనల కల్పవల్లివమ్మ
రిజర్వాయర్ల పులికత జలకళవమ్మ
మానవతా మూర్తిని కదిపిన
వేల్పువమ్మ
పాలమూరు దశదిశలు మారనున్నవి
కర్షకుల ఇక్కట్లు తొలగనున్నవి
హర్షంతో మా ప్రాంతాలు మురియనున్నవి
పంటలతో మా క్షేత్రాలు
తులతూగనున్నవి
మా కృష్ణమ్మకు అభినందనలు