నారాజ్
మరపో వెరపో ఉదాసీనతో నిర్లక్ష్యమో నానిన నోటినుంచి రాలిన మంత్రాక్షరాలనో తెలంగాణ పేరు మూలకుపడ్డది
మరపో వెరపో ఉదాసీనతో
నిర్లక్ష్యమో నానిన నోటినుంచి రాలిన మంత్రాక్షరాలనో
తెలంగాణ పేరు మూలకుపడ్డది
నిండైన చెరువులో కొట్టి కొట్టి, అలసి, నిద్ర కమ్ముకొచ్చింత ఈత
అడుగు బొడుగు రాళ్లు తేలి వెక్కిరిస్తున్నయి
రైతు భుజాన నాగలి
మళ్లీ జీసస్ చరమాంకం గుర్తుకు తెస్తున్నది
కాకతీయ కళాతోరణం కళ
నాలుక మీది మాటలా మెలిక పడ్డది
గోల్కొండ కోట మువ్వన్నెల ధీరత్వం వొదిలి
జీకు పిట్టల వశమైనది
మల్లినాథుని నుడుగుల పల్లీయత
తిట్ల రోతలో కుములుతున్నది
పునఃనిర్మాణ వైభవం శ్వేతపత్రంలో
నల్లమొగంతో తెల్లబోయింది
మూసీ తెల్లపండ్ల నవ్వుల కోసం
అమ్మ పరువు కాళ్ల బేరమయ్యింది
కంచెల్లేని పైరవీ స్వైరవిహారంలో
వినతుల వెతల విన్నపా లెవరికి?
నమూనాలన్ని ఎడమచేతి రాతకు గురౌతున్నయి
కాళేశ్వరం రోగగ్రస్థ శాపగ్రస్థ అని ముద్ర వేయించుకున్నది
ఖజానా ఉచితాల కర్ర కాళ్లతో నిలదొక్కుకోలేక చతికిల పడింది
గత దశమం ఉత్తదేనా?
అయోమయ ఇంద్రజాలమేనా?
కలలోనే నడిచినమా?
(మహాధిప మనోగతం, అసామాన్య ప్రజాక్షేత్రం
పెను సంఘర్షణా పరిణామ ఉప్పెనా విభ్రమ ఫలమా?)
మౌన ఋషిత్వ అంతర్ముఖీన విచికిత్సలో
సత్యజ్ఞాన ప్రకాశ మహోదయం సంభవించేనా!)
మూడున్నర కోట్ల నిగళాల ముక్తగానం,
పైశాచీ ఆనందాల రాజకీయం
వికృత క్రీడల విముక్త తెలంగాణ
ఎప్పుడు తల్లీ! ఓ కంజాతవల్లీ!
– మనస్విని
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

