పోరుబిడ్డల కన్న వీర తెలంగాణమా
శతకోటి దండాలు అందుకోవమ్మా
ప్రత్యేక రాష్ర్టాన్ని దీవించవమ్మా
1. రొండ్లు విరిగే పని ఎన్నాళ్ళు మనకని
ఏండ్ల తరబడి ఈ బతుకులేందని
జేరుబావులింక కట్టేది లేదంటు
ఊరి రైతులంత ఉప్పెనై లేచిన // పోరు //
2. ఆజాద్ హైదరాబాదంటు నినదించి
నైజాము గుండెల్లో కైజారు దింపేసి
లక్షలాది జనం గుండె చప్పుళ్ళతో
రాక్షస మూకల మేడల్ని కూల్చిన // పోరు //
3. పంటిబిగువున ఇంక ఆ బాధ పడలేక
చంటిపాపల ఊచకోతల్ని కనలేక
మంగిలీ లచ్చక్క మల్లు స్వరాజ్యం రాములమ్మ
సంగరాన కొదమ సింగాలై నిలిచిన // పోరు //
4. నల్లగొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్
అల్లకల్లోలమయ్యే ఖాసిం రజ్వీతో
కోటి రత్నాల వీణ నా తెలంగాణంటు
పాటల ఈటల్ని మాటేసి విసిరిన // పోరు //
5. వేషభాషలోన యాసకొంతున్నను
మోసమే తెలియని మంచి మనసోళ్ళము
ఆంధ్ర రాయలసీమ ఆర్భాటగాళ్ళంతా
చిందులే తొక్కినా చీల్చిచెండాడిన // పోరు //
6. సహజవనరులెన్నో సమృద్ధిగా ఉన్న
బహుచక్కని సిరుల బంగారు నా తల్లి
కోటొక్క దేవుళ్ళ కొండంత బలముతో
ధీటైన చరితకు బాటలే వేసేము // పోరు //
రాకుమా ర: 95501 84758