మట్టిని కాదు
మనిషిని ప్రేమించే వాడొచ్చాడు
అబ్ ఢిల్లీ బహుత్ దూర్ నహీ హై!
నదులు
సముద్రాలకు విడాకులిస్తాయి
పొలాలతో సహజీవనం చేస్తాయి!
సువిశాల దేశంలో
విద్యుత్ వెలుగులు దోబూచులాట మాని
పగలూ రేయీ ఒక్కటై నిలుస్తాయి!
ఇకపై రైతు కన్నెప్పటికీ
కన్నీరెరుగదు..
రైతు రాజ్యమేలే కాలమొచ్చింది!
ఎవరి తిండి వారే తినవచ్చు
ఎవరి బట్ట వారే ధరించవచ్చు
నిఖార్సయిన
ప్రజాస్వామ్యంలో నిషేధాలుండవు!
ఎవరి విశ్వాసాలు వారివే
భిన్నత్వంలోని సౌందర్యమే
భారతదేశానికి తరగని ఆకర్షణ!
ఏడున్నర దశాబ్దాల స్వేచ్ఛాకాలం
వేళ్ళ సందుల నుంచి వృథాగా జారిపోయింది
సమీక్షకుడొచ్చాడు స్వాగతించండి!
ఆయుధాలు సమకూర్చుకొనే
యుద్ధం మొదలెట్టాడు
వీర తిలకం దిద్దడమే మన వంతు!
మాటల్లోనే మేకి ఇన్ ఇండియా
దేశం టేకోవర్ అవుతున్నది
యువతరమా మేల్కొనండి!
బంగారు తెలంగాణకు తెరదీస్తున్న వేళ
జయ గీతాలతో హోరెత్తించండి!!
కోట్ల వెంకటేశ్వరరెడ్డి: 94402 33261