Donald Trump | ట్రంప్‌పై హత్యాయత్నం.. ఎన్నికలపైనే కాదు అమెరికాపై కూడా ప్రభావం
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి మధ్యలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఆయన అచ్చంగా వెంట్రుకవాసిలో మృత్యువును తప్పించుకోవడంతో అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
Donald Trump | అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి మధ్యలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఆయన అచ్చంగా వెంట్రుకవాసిలో మృత్యువును తప్పించుకోవడంతో అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ప్రజాస్వామిక దేశమైన అమెరికాలో పరాకాష్ఠకు చేరిన హింసా సంస్కృతికి ఇది అద్దం పడుతున్నది. సాయుధ అంగరక్షకుల తక్షణ ప్రతిస్పందనతో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డప్పటికీ, నిఘా, భద్రతా ఏర్పాట్ల వైఫల్యం విమర్శలకు గురవుతున్నది. సాయుధ ఆగంతకుడు ఒక మాజీ అధ్యక్షునికి అంత సమీపంలోకి ఎలా రాగలిగాడన్నది ప్రశ్న. ఈ హత్యాయత్నం వెనుక ఉన్న వ్యక్తులెవరో, వారి కుట్రలేమిటో ఇంతవరకైతే పెద్దగా తెలియరాలేదు. సాధారణంగా ఇలాంటి ఘటనలపై ఊహాపోహలు, కుట్రకథనాలు వెల్లువెత్తుతాయి. మాజీ అధ్యక్షుడు కెనెడీ హత్యోదంతం నిగూఢంగానే ఉండిపోవడం తెలిసిందే. ఇప్పుడీ ఘటన కూడా అలాగే మిగిలిపోవచ్చు. దాడికి తెగబడ్డ యువకుడిని భద్రతాధికారులు మట్టుపెట్టిన కారణంగా అసలు రహస్యం ఎప్పటికైనా బయటకు వస్తుందా? అనేది సందేహాస్పదమవుతున్నది.
దాడి ఘటన ఎన్నికల్లో రాజకీయ వేడి రాజేస్తున్నది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తంగా ఎన్నికల ప్రచార సరళిని అది రాత్రికి రాత్రే తారుమారు చేసింది. సహజంగానే అధ్యక్ష ఎన్నికల్లో అదొక నిర్ణాయక అంశంగా మారుతున్నట్టు స్పష్టమవుతున్నది. చెవిపైన, ముఖంపైన రక్తం చారికలతో కూడిన డొనాల్డ్ ట్రంప్ ఫొటోలను రిపబ్లికన్ పార్టీ ప్రచారాస్ర్తాలుగా చేసుకుంటున్నది. అధ్యక్షుడు బైడెన్ తన రిపబ్లికన్ ప్రత్యర్థిపై చేసిన తీవ్ర విమర్శల ఫలితంగానే హత్యాయత్నం జరిగినట్టు రిపబ్లికన్ నేతలు ఆరోపించడమే ఇందుకు నిదర్శనం. ట్రంప్ మళ్లీ గెలిస్తే ప్రమాదమనీ, ఆయన ఓ నియంతగా మారి అమెరికా జీవనవిధానాన్ని దెబ్బ తీస్తారని జో బైడెన్ చేసిన హెచ్చరికలను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా ట్రంప్‌పై ‘గురి’పెట్టాలని, ఆయనను ‘లక్ష్యం’గా చేసుకోవాలని ఇచ్చిన పిలుపును ఎత్తిచూపుతున్నారు. బైడెన్ యాదృచ్ఛికంగానే ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పుడు వాటినే ఎదురుదాడికి ఉపయోగించుకుంటున్నారు.
2020 అధ్యక్ష ఎన్నికల్లో పరాజయాన్ని అంగీకరించకుండా తన మద్దతుదారులతో కాంగ్రెస్ భవనంపై దాడి జరిపించారన్న ఆరోపణలు ట్రంప్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దాడి ఫలితంగా ఆయన కాంగ్రెస్ అభిశంసనకు గురవడమే కాకుండా, అనేక కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలా ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆయన మరోసారి రిపబ్లికన్ అభ్యర్థిగా నామినేషన్ పొందడమే కాకుండా అధ్యక్షుడు బైడెన్‌కు గట్టి పోటీ ఇస్తుండటం విశేషం. అటు ప్రచారంలో వెనుకబడినట్టుగా భావిస్తున్న అధ్యక్షుడు బైడెన్ విజయావకాశాలను దాడి ఘటన తీవ్రంగా తీస్తే, ఇటు స్వల్ప ఆధిక్యతలో ఉన్న ట్రంప్‌కు సానుకూలత భారీగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అంతిమంగా గెలుపోటములు ప్రజల చేతుల్లో ఉంటాయి. పెన్సిల్వేనియాలో జరిగిన దాడి ప్రస్తుత ఎన్నికలపై మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా అమెరికాపై ప్రభావం వేస్తుందని చెప్పవచ్చు.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

