రోజులు మారాయి!

హెచ్-1బీ వీసాలపై నిషేధాన్ని కొనసాగించకూడదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించడంతో భారతీయ యువతకు, ప్రత్యేకించి ఐటీ నిపుణులకు ఊరట లభించింది. హెచ్-1బీ వీసాలపై గతేడాది జూన్‌లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిషేధం ఈ నెల చివరితో ముగియనుంది. నాడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ ఐటీ కంపెనీలే కాదు, సిలికాన్ వ్యాలీ ఐటీ దిగ్గజాలు కూడా తీవ్రంగా నిరసించాయి. విదేశీ నిపుణుల తాత్కాలిక నియామకాలపై నియంత్రణ విధించటం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటినుంచి ట్రంప్ కన్నా భిన్నమైన పాలన అందిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. తాజా నిర్ణయం తదనుగుణమైనదే.
విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్1-బీ వీసాలను అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉపయోగించుకుంటాయి. పరిమితి ప్రకారం ఏటా 65 వేల హెచ్1-బీ వీసాలతో పాటు, మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి మరో 20 వేల వీసాలు ఇస్తారు. ఇప్పటికే సరిపడా దరఖాస్తులు అందాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) తెలిపింది. వాటికి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. వీటిలో సింహభాగం భారత యువకులే ఉంటున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో సగటున ప్రతి ఇరవై కుటుంబాల నుంచి ఒకరు అమెరికాలో అడుగుపెట్టడం విశేషం. ‘అమెరికన్లకే ప్రథమ ప్రాధాన్యం’ నినాదంతో వలస కార్మికుల వ్యతిరేక విధానాలను ట్రంప్ అవలంబించారు. దీంతో లక్షలాది యువత తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటినుంచీ తనదైన శైలిలో వ్యవహరిస్తూ విద్వేష రాజకీయాలకు తెరదించారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయటంతో పాటు, భారతీయ మూలాలున్న డజనుకు పైగా ప్రముఖులకు పాలనారంగంలో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అమెరికా సమాజంలో పేరుకుపోయిన జాతి విద్వేషాలను సమూలంగా రూపమాపడం అంత సులభం కాదు. ఈ మధ్యకాలంలో ఆసియా అమెరికన్లపై దాడులు పెరిగిపోయాయి. న్యూయార్క్ టైమ్స్ స్కేర్ సమీపంలో ఓ ఆసియన్ అమెరికన్ వృద్ధురాలిపై దాడి జరిగింది. కరోనా వ్యాప్తికి ఆసియన్లే కారణమనే అపోహతోనే ఇవి జరుగుతుండటం గమనార్హం. ఇలాంటి జాతి, వర్ణ వివక్ష దాడులను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆసియన్లపై నేరాలకు సంబంధించి న్యాయశాఖపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బైడెన్ ప్రకటించటం హర్షణీయం. బహుళపక్ష పాలనకు సంకేతంగా ఉన్న బైడెన్ సర్కార్ శాంతి, సహజీవనాలను పాదుకొల్పే చర్యలు చేపట్టాలి.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

