ప్రశాంతతతోనే పెట్టుబడులు

ప్రజల మధ్య చిచ్చుపెట్టే శక్తుల పట్ల హైదరాబాదీయులు మరింత జాగ్రత్తగా మసలాల్సిన సమయమిది. ఎన్నికల సందర్భంగా మోసపోతే గోస తప్పదు. ఏది నిజం.. ఏది అబద్ధమో గమనించాలి. ఎవరితో అభివృద్ధి సాధ్యమైతుందో బేరీజు వేసుకోవాలి. సరయిన నిర్ణయం తీసుకోవాలి. నాలుగొందల ఏండ్ల నగర విశిష్టతను కాపాడుకుంటేనే మరింత ప్రగతి సాధ్యమవుతుంది. ప్రజల మధ్య చిచ్చుపెట్టే శక్తుల పట్ల హైదరాబాదీయులు మరింత జాగ్రత్తగా మసలాల్సిన సమయమిది. ఎన్నికల సందర్భంగా మోసపోతే గోస తప్పదు. ఏది నిజం.. ఏది అబద్ధమో గమనించాలి. ఎవరితో అభివృద్ధి సాధ్యమైతుందో బేరీజు వేసుకోవాలి. సరయిన నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శంగా వెలుగొందుతున్నది. ప్రపంచంలోనే హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తున్నది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, అంకితభావం వల్లే ఇదంతా సాధ్యమవుతున్నది. ఇప్పుడు రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని సంతరించుకున్నది. నగరం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో వివిధ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి.
పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు, పకడ్బందీ శాంతిభద్రతలు ఉన్న హైదరాబాద్ నగరం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు పోటీపడి వస్తున్నాయి. వాటివల్ల ఉపాధి, ఆదాయం సమకూరుతున్నాయి. ప్రభుత్వానికి మంచిపేరు వస్తున్నది. ఇది ఎవరైనా ఆనందించాల్సిన పరిణామమే. అయితే కేవలం అధికారం అందుకోవాలనే తపనే తప్ప మరేదీ పట్టని బీజేపీకి ఇప్పుడు ఈ ప్రగతి కార్యక్రమాలు మింగుడుపడటం లేదు. అబద్ధమే నైజంగా మారిపోయిన ఆ పార్టీ ఇక్కడి వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నది. మరోవైపు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ప్రయత్నిస్తున్నది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిణామమిది.
ప్రశాంత వాతావరణం, సకల సదుపాయాలున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి చొరవతో అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆమెజాన్ కంపెనీ ఒకటే 21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మొత్తంగా వివిధ కంపెనీల పెట్టుబడులు రెండు లక్షల కోట్లు. ఇంతగా అలరారుతున్న నగరంలో బీజేపీ నేతలు గ్రేటర్ ఎన్నికల వేళ విషం చిమ్ముతున్నారు. జాతీయవాదం పేరుతో మతతత్వ ధోరణితో ముందుకుసాగుతున్నారు. యువత మెదళ్లలో బీజేపీ నేతలు సోషల్ మీడియా ద్వారా విషబీజాలు నాటుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సంజయ్ విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా బాబర్, అక్బర్, లాడెన్ ప్రస్తావన తీసుకొచ్చారు. గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామని వ్యాఖ్యానించారు. ప్రజాక్షేమం పట్టించుకునే, పరిణత నేతల మాటలు కావివి. అన్నిమతాలవారు ఐక్యతతో సామరస్యంగా ప్రశాంత జీవనం గడుపుతున్న హైదరాబాద్ నగర ప్రతిష్ఠను దెబ్బతీసే ధోరణి ఇది.
వరదలు, భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డ నగర ప్రజలను అన్నివిధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుంటే.. ఇవేవీ నచ్చని బీజేపీ బురద రాజకీయం చేస్తున్నది. పేదల నోటి కాడి బుక్కను లాక్కునేలా ఆ పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం ఈ ఆరేండ్లలో కొన్ని దశాబ్దాల ప్రగతిని సాధించిందనవచ్చు. మరే పార్టీకీ ఇలాంటి దూరదృష్టి, కార్యాచరణ పథకాలు లేవనేది గుర్తించాలి. ప్రత్యామ్నాయ నమూనాలను చూపించలేని దుస్థితిలో ఉన్న పార్టీలు ప్రజల మధ్య విషప్రచారం సాగిస్తున్నాయి. విడదీయాలని చూస్తున్నాయి. ఆ పరిస్థితులే ఉత్పన్నమయితే హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారుతుంది. శాంతిభద్రతలు అదుపులేని స్థితిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. నాలుగొందల ఏండ్ల నగర విశిష్టతను కాపాడుకుంటేనే మరింత ప్రగతి సాధ్యమవుతుంది.
జీ. బ్రహ్మచారి
తాజావార్తలు
- పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?
- సలార్ కథానాయికని ప్రకటించిన చిత్ర బృందం
- తమిళనాడులో దొంగల బీభత్సం : 17 కేజీల బంగారం చోరీ
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు