సమన్యాయం దిశగా..

‘బాలికా అహం బాలికా, నవ యుగ్ జనితా అహం బాలికా/ నాహంబలా దుర్బలా, ఆదిశక్తి అహమంబికా’ అనే సంస్కృతోక్తి ఉన్నది. ‘నేను బాలికను, నవయుగ బాలికను. దుర్బలను కాను, శక్తివిహీనను కాను. ఆది శక్తిని, అంబికను’ అంటూ చెప్పుకోవడాన్ని మించిన అస్తిత్వ ప్రకటన మరేమున్నది! దేశ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు మహిళా న్యాయమూర్తులు పరమోన్నత న్యాయస్థానంలో విధులు నిర్వహించటం ఈ విధమైన మహిళా సాధికారత ప్రకటనకు సంకేతంగా చెప్పుకోవచ్చు. మహిళా న్యాయవాదుల సంఘం ఆదివారం ఏర్పాటు చేసిన ఒక సభలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగిస్తూ- ‘మహిళలారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు.. సంకెళ్లు తప్ప’ అంటూ పిలుపు ఇవ్వడం సందర్భోచితంగా ఉన్నది. న్యాయవ్యవస్థలోని అన్ని నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని, దీనిని మహిళలు తమ పోరాటంతో సాధించుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించడం గమనార్హం.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలోనూ స్త్రీ పురుష అసమాతన వివిధ రంగాలలో ద్యోతకమవుతున్నది. న్యాయ వ్యవస్థలోనూ ఇది ప్రతిబింబిస్తున్నది. ఈ నేపథ్యంలో మహిళలకు అన్ని రంగాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలంటూ 1995 సెప్టెంబర్‌లో ‘బీజింగ్ డిక్లరేషన్’ పేరిట ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘మహిళా న్యాయమూర్తుల అంతర్జాతీయ సంఘం’ దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపట్టింది. మహిళా న్యాయమూర్తుల సంఖ్యను పెంచటమంటే మహిళల హక్కులను సాధించుకోవటమే కాదు, చట్టబద్ధ పాలనను మరింత బలోపేతం చేయడమంటూ ఆ సంస్థ గళమెత్తింది. మార్చి 10వ తేదీని ‘అంతర్జాతీయ మహిళ న్యాయమూర్తుల దినం’గా ప్రకటిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
న్యాయ వ్యవస్థలో మహిళలు సమన్యాయం కోరడాన్ని అంతర్జాతీయ పోకడగా గుర్తించవచ్చు. ఈ క్రమంలోనే పలు దేశాలలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతున్నది. మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఫ్రాన్స్‌లో 71 శాతం, ఇటలీలో 53 శాతం, జర్మనీలో 44 శాతం, స్పెయిన్‌లో 40 శాతం, అమెరికాలో 35 శాతం వరకు పెరిగింది. మన దేశ న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులుగా, అధికారులుగా స్త్రీల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. కింది కోర్టుల్లో 30 శాతంలోపు ఉంటే, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 11-12 శాతానికి పరిమితమైంది. జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు ఇచ్చినట్టు మహిళలు సమన్యాయం సాధించుకునే దిశగా సమాజం అడ్డంకులను తొలగించవలసి ఉన్నది. న్యాయ వ్యవస్థలో సమన్యాయం లభించి, ఆ పరిణామం ఇతర రంగాలలో సమానావకాశాలకు దారి తీస్తుందని ఆశిద్దాం.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

