అవసరాల శ్రీనివాస్.. ఈ పేరు చాలా మందికి సుపరిచితం. నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న అవసరాల ప్రస్తుతం వివాదంలో చిక్కకున్నాడు. మూడేళ్లుగా అతని దగ్గర కో డైరెక్టర్‌గా పని చేస్తున్న మహేష్ అనే వ్యక్తిని కారణం లేకుండా తీసేయడంతో అవసరాల అసలు రూపం బయటపెట్టేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అవసరాల శ్రీనివాస్ వీడియో బయటపెడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
అవసరాల శ్రీనివాస్ మనకు కర్లీ హెయిర్‌తో ఎక్కువగా కనిపిస్తుంటారు. అతనికి బట్టతల ఉందనే విషయం ఇప్పటి వరకు సినీ ప్రేక్షకులు ఎవరికి తెలియదు. మహేష్ షేర్ చేసిన వీడియోతో అవసరాల అసలు రూపం బయటపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా, ఇందులో మహేష్, అవసరాల శ్రీనివాస్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మనం గమనించవచ్చు. ఎప్పుడు కూల్‌గా ఉండే అవసరాల శ్రీనివాస్ ఇంత ఫైర్ కావడానికి కారణం ఏంటని నెటిజన్స్ ముచ్చటించుకుంటన్నారు. అయితే ఇది ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసి ఉంటారని మరి కొందరు అంటున్నారు.