అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ బుర్జుగల్లీలో రూ.9.50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలోని ప్రధాన, అంతర్గత రోడ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. బీటీ, సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టామన్నారు. అవసరమైన చోట వీడీసీసీ రోడ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, పార్టీ సీనియర్ నాయకులు డా.ఎస్.సులోచన, అరుణ్‌కుమార్‌రెడ్డి, శ్రీరాములుముదిరాజ్, అఫ్రోజ్పటేల్, మిర్యాల రవీందర్, కోట్ల సంతోష్, శ్రీనివాస్, కనివేట నర్సింగ్‌రావు, బొట్టు శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.