Hyderabad | సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత : ఎమ్మెల్యే అహ్మద్ బలాల

చాదర్ఘాట్ : నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. ఆజంపురా డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు బుధవారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల డివిజన్ పరిధిలోని ఆజంపురా చమన్, లారీ కాంట, సీ క్లాస్, టార్జాన్ గ్రౌండ్ ప్రాంతాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పాధయాత్ర నిర్వహించారు. స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యంగా టార్జాన్ గ్రౌండ్లోని పురాతన లైబ్రరీ స్థానంలో కొత్త లైబ్రరీ నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. సీ క్లాస్ క్వార్టర్స్, లారీ కాంట వద్ద వర్షం నీరు నిలిచే పాయింట్లలో కొత్తగా క్యాచ్ పిట్లు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్బలాల మాట్లాడుతూ వర్షం నీరు నిల్వ ఉండే చాలా చోట్ల సమస్య పరిష్కారానికి స్ట్రాం వాటర్ పైప్లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీ క్లాస్, ఆజంపురా కాంట వద్ద క్యాచ్ పిట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, టీఎస్ఎస్పీడీసీఎల్, జలమండలి అధికారులు, ఎంఐఎం నేతలు షేక్ మొహియుద్దీన్ అబ్రార్, అలీం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

