అమీర్పేట : దసరా నవరాత్రుల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు ఆదివారం నాడు అన్నపూర్ణా దేవి అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దాతలు సమకూర్చిన స్వీట్లు, డ్రైఫూట్లతో అమ్మవారిని అలంకరించారు.
అమీర్పేట్ డీకేరోడ్డుకు చెందిన శ్రీ విజయ స్వగృహ ఫుడ్స్ వారు సమర్పించిన స్వీట్లతో పాటు కోవాతో రూపొందించిన శివలింగం ఆకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.