Governor| వైభవంగా ఆలయ రజతోత్సవాలు.. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ తమిళ సై

మాదాపూర్ : తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ శుక్రవారం చందానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవాలకు హజరై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీల ఆశీస్సులను అందుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామి వారు జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను గవర్నర్‌కు బహుకరించారు.
తమిళ సై నుదుటన కుంకుమ తిలకం దిద్ది రాజ శ్యామల అమ్మవారి రక్షారేఖను కట్టారు. ఈ సందర్భంగా తమిళ సై మాట్లాడుతూ … విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి వారి ఆశీస్సులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. లోక కల్యాణం కొరకు ఆధ్యాత్మిక మార్గంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు చేపడుతున్న కృషి అభినందనీయమన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల నుండి ప్రజలంతా బయటపడాలని స్వామీజీని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. చందానగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా ఉన్నాయని ఆమె తెలిపారు. అనంతరం చెవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ గాంధీ, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లు స్వామి వారిని దర్శించుకొని స్వామిజీని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

