Gas filling | అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రంపై టాస్క్‌పోర్స్ దాడులు.. వ్యక్తి అరెస్ట్

చార్మినార్ : గ్యాస్ సిలిండర్ అక్రమ ఫిల్లింగ్ నిర్వహణ కేంద్రంపై దక్షిణ మండల టాస్క్‌పోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం చాదర్‌ఘాట్‌లోని సిటీ మోడల్ స్కూల్ సమీపంలో ధర్మేష్సింగ్ అక్రమ గ్యాస్ రీ ఫిల్లింగ్ నిర్వహిస్తూ అధిక ధరలకు ఆటో డ్రైవర్లతోపాటు ప్రైవైట్ వ్యక్తులకు అమ్మకాలు చేపడుతున్నాడు.
విశ్వసనీయ సమచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుని వద్ద నుండి 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సిలిండర్లతోపాటు 11 కమర్షియ ల్, 20 చిన్న 5 కేజీల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నిందితునితోపాటు స్వాధీనం చేసుకున్న సిలిండర్లను సివిల్ సప్లై అధికారులకు అప్పగించామని తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌పోర్స్ ఎస్సై శ్రీశైలంతోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

