Championship Competitions | రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ విజేతలుగా పురుషుల్లో వరంగల్.. మహిళల్లో ఖమ్మం

వనస్థలిపురం : వనస్థలిపురం సర్ధార్ వల్లభాయ్‌పటేల్ మైదానంలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగం విజేతగా వరంగల్ జట్టు నిలువగా ద్వితీయ స్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో ఖమ్మం జిల్లా జట్లు నిలిచాయి.

మహిళల విభాగంలో ఖమ్మం జిల్లా జట్టు విజేతగా నిలువగా ద్వితీయ స్థానంలో నిజామాబాద్, తృతీయ స్థానంలో వరంగల్ జట్లు నిలిచాయి. విజేతలకు ఆదివారం సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారావు, బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రవీందర్, వివిధ జిల్లాల మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

