మియాపూర్ : మహిళా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దేశంలోనే తొలి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మహిళల రక్షణతోపాటు వారి సర్వతోముఖాభివృద్ధికి విభిన్న సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని , మహిళలే తమ ప్రభుత్వానికి మహరాణులన్నారు.
కేటీఆర్ పిలుపు మేరకు మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా తొలి రోజు ఆదివారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో కార్పొ రేటర్ రోజాదేవి సహా మహిళలతో , అనంతరం హైదర్‌నగర్ డివిజన్లోని హైదర్‌నగర్‌లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు నేతృత్వంలో మహిళలతో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రాఖీలు కట్టడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు చీరెలను విప్ గాంధీ పంపిణీ చేశారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎందరో మహిళలు తమ ప్రతిభతో దూసుకెళుతున్నారన్నారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ ,షీటీమ్స్‌తో పాటు మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను మహిళల కోసమే తమ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గాంధీ పేర్కొన్నారు.
రాబోయే రోజులలో మరిన్ని పథకాలు మహిళలం దరికీ చేరనున్నాయన్నారు. ప్రతి ఆడపడచుకు అన్నలా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని , వారి భద్రత కోసం షీ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారన్నారు. సంక్షేమ పథకాలతో యావత్ మహిళా లోకం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నిండు మనసుతో జీవిస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు.
కేటీఆర్ పిలుపు మేరకు మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ నేతృత్వంలో మియాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో తొలి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా పారిశుద్ద్య కార్మికులు ప్లకార్డులు చేతబూని ప్రదర్శనచేశారు.
ఈ సందర్భంగా పారిశుద్ద్య కార్మికులతో పాటు ఆర్పీలు, మహిళలను కార్పొరేటర్ శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, రాజేందర్, పెద్ద భాస్కర్‌రావు, వెంకటేశ్‌యాదవ్, వివేకానందనగర్, హైదర్‌నగర్ డివిజన్ల పార్టీ నేతలు , మహిళా నేతలు పాల్గొన్నారు.