Osmania university | ఉస్మానియా విద్యా సమచారం

వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈ, ఎంటెక్, బీపీఈడీ, డీపీఈడీ తదితర కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania. ac.in అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల ఫార్మ్‌డీ మొదటి, రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్, మూడేళ్ల ఫార్మ్‌డీ మొదటి, రెండో సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల మార్పు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.బీకామ్, బీఎస్సీ, బీఏ, బీఎస్ డబ్ల్యూ, బీబీఏ తదితర కోర్సుల రెండో, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు తోడు దూరవిద్య డిగ్రీ కోర్సుల మొదటి, రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 30నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
వాయిదా పడిన పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ, : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఇంజినీరింగ్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీలలో జరగాల్సిన అన్ని బ్రాంచీల బీఈ కోర్సుల పరీక్షలను అధికారులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 3, 9 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా కేంద్రం, పరీక్షా సమయాలలో ఎటువంటి తేడా ఉండబోదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
ఓయూ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీలో కేటగిరీ – 1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) – జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించిన వారితో పాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ సాధించిన వారు అర్హులని ఓయూ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఓయూ ప్రెస్ నుంచి దరఖాస్తు ఫారం తీసుకుని, సంబంధిత పత్రాలతో కలిపి తమ కార్యాలయంలో వచ్చే నెల 29 లోగా దాఖలు చేయాలని చెప్పారు. ఇతర వివరాలకు 040 – 27098643 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

