Hyderabad |ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగం : సినీ నటుడు సుమన్

కవాడిగూడ : ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ సినీ నటుడు, మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర ప్రతినిధి సుమన్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్‌పూర్‌లో ప్రముఖ కరాటే మాస్టర్ షఫీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జూడోక్లబ్ కరాటే పోటీల వాల్‌పోస్టర్‌ను ఆయన స్థానిక కార్పొరేటర్ మహ్మద్ గౌసొద్దీన్ తహ, టీఆర్ఎస్ నగర యుజవన విభాగం నాయకుడు ముఠా జయసింహలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ కరాటే వల్ల ఆత్మరక్షణే కాకుండా శరీరాన్ని ఆయుధంగా మలుచు కునే అద్భుతమైన క్రీడ అని అన్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసికోల్లాసాన్ని ఇస్తుందని అన్నారు. ముఖ్యంగా విద్యార్ధినీ, విద్యార్థులు, యువత కరాటేపై దృష్టి సారించి శిక్షణ పొందాలని అన్నారు.
టీఆర్ఎస్ నగర విభాగం నాయకుడు ముఠా జయసింహ మాట్లాడుతూ కరాటే వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని పెంచేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కరాటే మాస్టర్ కనకరాజు, టీఆర్ఎస్ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

