నింబోలీ అడ్డా ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు

కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం ఆలియాబాద్‌లోని గాజిబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ (45) గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు గురువారం రాత్రి నింబోలి అడ్డా సంఘం హోటల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తుండగా సయ్యద్ ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని, ఆతని నుంచి 3 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని శుక్రవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

