Jubilee Hills Co-operative Society | జూబ్లీహిల్స్ సొసైటీ కార్యదర్శిపై అవిశ్వాసం.. హైడ్రామా నడుమ ఆమోదం

బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ కో అపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్‌పై పాలకమండలిలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం హైడ్రామా మధ్య ఆమోదం పొందింది. పాలకమండలిలో విభేదాలతో కార్యదర్శి మురళీముకుంద్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సొసైటీ కార్యాలయంలో పాలకమండలి సభ్యులు సమావేశమయ్యారు. సహకారశాఖ రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఉదయం 11.30కి సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా తనపై నిభంధనలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని నిలిపివేయాలంటూ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్ హైకోర్టులోని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సరిగ్గా సమావేశం ప్రారంభమవడానికి ఏడు నిమిషాల ముందు సమావేశాన్ని మూడురోజుల పాటు ఆపాలంటూ తీర్పు వచ్చింది. అయితే తీర్పు విషయాన్ని ప్రస్తావించకుండా రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 12మంది సభ్యులు ఓటు వేయడంతో సొసైటీ కార్యదర్శిగా మురళీ ముకుంద్‌ను తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణ సహకారశాఖ నిభంధనల ప్రకారం మూడేళ్ల పాటు పాలకమండలి సభ్యుడిని తొలగించేందుకు అధికారం లేదని, బైలాస్‌ను ఉల్లంగించడంతో పాటు కొంతమంది ఒత్తిళ్లతో కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా అవిశ్వాస తీర్మానానికి అనుమతించిన రిజిస్ట్రార్ మీద కోర్టు దిక్కరణ కేసు వేస్తామని సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

