Dalitha bandhu | దళితబంధు ద్వారా చేయూత గొప్ప సంకల్పం : గజ్జెల కాంతం

ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : తెలంగాణ దళిత బంధు ద్వారా ఆ వర్గాలకు ఆర్థిక చేయూతనందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని దళితుల తరపున కృతజ్ఞతలు తెలుపు తున్నానన్నారు. వారితో పాటు గిరిజనులకు, బీసీల్లోని పేద వర్గాలకు కూడా ఇలాంటి పథకం తీసుకురావాలన్నారు.
స్వాంతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఏ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. దళిత బంధును ఎవరూ వ్యతిరేకించినా దళిత ద్రోహులవుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని అభినందిస్తూ అక్టోబర్ 9న ఇందిరాపార్కు వేదికగా కృతజ్ఞత బహిరంగసభ నిర్వహిస్తున్నామని, దళిత ప్రజాప్రతినిధులు హాజవుతున్నారని తెలిపారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితుడిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందించాల్సిందేనని అన్నారు. ముక్కు పచ్చలారని బాలికకు జరిగిన అన్యాయానికి నిందితుడికి తగిన శిక్ష పడిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వేగంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఆ పాప కుటుంబాన్ని కూడా ఆదుకున్నదని అన్నారు.
హిందుత్వమని చెప్పుకొని తిరుగుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ తమ పార్టీకి సంబంధించిన కేంద్ర పాలకులు నల్ల రైతు చట్టాలు తీసుకువచ్చినప్పుడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినప్పుడు హిందుత్వం గుర్తుకు రాలేదా అని అన్నారు. నేడు తెలంగాణ రైతులు పండించిన పంటను కొనమంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

