చార్మినార్ : గులాబ్తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షానికి పాతనగరంలోని మీర్అలం చెరువు అలుగు పారింది. పై ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటితో మీర్అలం చెరువు నిండుకుండలా మారింది. జూ పార్క్ ఆవరణవైపు కొనసాగుతున్న మీర్ అలం చెరువు వరద అధికమై జూలోని సఫారీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో సఫారీ మార్గంలోకి వరదనీరు వచ్చి చేరడంతో మంగళవారం ఉదయం జూను సందర్శించిన పర్యాటకులు ఆ మార్గంలో ప్రయాణించడానికి స్వల్పంగా ఇబ్బందులు పడ్డారు.
సందర్శకులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన జూ పార్క్ అధికారులు వెనువెంటనే సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకున్నారు. సఫారీ సమీపంలోని చెరువుతోకి వరదనీరు చేరుకోడానికి అడ్డంకిగా మారిన ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకున్నారు. వరదనీటి ప్రధాన కాలువల్లోని అడ్డంకులను గుర్తిస్తూ సిబ్బంది వాటిని తొలగించ డానికి ప్రయత్నించారు.