100 years celebrations | ఘనంగా సిటి కాలేజీ శతాబ్థి ఉత్సవాలు

చార్మినార్ : మానులా మొదలై నేడు మహావృక్షంగా ఎదిగిన సిటి కాలేజీ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపి వారిని ప్రపంచ వ్యాప్తంగా చేరవేసిందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. మంగళవారం సిటి కాలేజీ నిర్వహించిన శత వసంతాల వేడుకల్లో నవీన్ మిట్టల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సిటి కాలేజీ తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందన్నారు.
ఉద్యమంతోపాటు విద్యాభోధనలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తూ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఉద్యమాల సమయంలో కీలక భూమిక పోషించిన సిటి కాలేజీ విద్యార్థులకు విద్యాభోధన అందించడంలోనూ తన పాత్రను మరింత ద్విగుణీకృతం చేసుకుంటూ బంగారు బాటను పరించిదన్నారు. నేటి అధునికతను చాటుకుంటూ కాలేజీలో వివిధ రంగా ల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి 50 కోర్సులతో అగ్రగామిగా కొనసాగుతుందన్నారు.
నేడు అత్యున్న స్థానాల్లో సేవలు అందిస్తున్న అనేక మంది సిటి కాలేజీ పూర్వవిద్యార్థులేనని అచార్య ఘంటా చక్రపాణి తెలిపారు. సిటి కాలేజీ నగరానికి ఓ శాంతినికేతన్లాంటిదని అభివర్ణించారు. ఏడవ నిజాలం ఎంతో దార్శనికుడని, ఆయన ముందు చూపుతోనే సిటి కాలేజీ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోని సంస్థానాదీశులెవరూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు ఉన్న దూరదృష్టితో భవిష్యత్తును గుర్తించలేక పోయారని తెలిపారు.

రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా సిటి కాలేజీతో అనుబంధమున్న అనేకమంది ప్రముఖులు ఉన్నారని తెలిపారు. వందేళ్ల కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులు సిటి కాలేజీకి చెందినవారిని తెలుసుకుంటే మనస్సు ఉప్పొంగు తుందని నిజాం వారసుడు నవాబ్ నవాజ్ అలీఖాన్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. తమ పూర్వీకులు నెలకొల్పిన విద్యావనం నుండి భవిష్యత్తులో మరింత మంది ప్రపంచానికి మార్గదర్శకులు రావాలని అకాంక్షించారు.
సిటి కాలేజీ అభ్యున్నతికి పాడుపడేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. శత వసంతాల వేడుకల సందర్భం గా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శతాబ్థి ఉత్సవాల సందర్భంగా వేడుకల డిజిటల్ లోగోను కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సిటి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ భాలభాస్కర్తోపాటు తెలుగు సహాయ ఆచార్యులు కోయి కోటేశ్వర్రావు, శ్రీకాంత్‌రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ అనురాధరెడ్డి, అధ్యాపకులు పావనితోపాటు అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

