ఎర్రగడ్డ : చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో బల్దియా పారిశుద్ధ్య కార్మికులకు ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్’ సంస్థ వారు వింటర్ కిట్లను అందజేశారు. బోరబండ డివిజన్ సైట్-1 కాలనీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కిట్లను పంపిణీ చేశారు.
ఒక్కో కిట్లో బ్లాంకెట్, స్వెటర్తో పాటు అధిక చలి నుంచి రక్షణను కల్పించే వస్తువులున్నాయని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధి సుశీల్ తెలిపారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య విభాగం అధికారి విజయకుమార్, వీకర్సెక్షన్ టీఆర్ఎస్ నేత ధర్మ తదితరులు పాల్గొన్నారు.