Public problems | ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : విప్ అరెకపూడి గాంధీ

కొండాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్నగర్, అంజయ్యనగర్లలో స్థానిక కార్పొరేటర్ షేక్ మమీద్ పటేల్తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను స్వయంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాల సమస్యలున్నాయని, వెంటనే పరిష్కరించాల్సిందిగా కాలనీ వాసులు వారి దృష్టికి తీసుకు వచ్చారు.
వెంటనే స్పందించిన విప్ గాంధీ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను పరిశీలించి సమస్య పునరావృతమవ్వకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజా ఇబ్బందులను తొలగించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవిందర్ ముదిరాజ్, నాయకులు కృష్ణ గౌడ్, తిరుపతిరెడ్డి, రవిశంకర్ నాయక్, యాదయ్య గౌడ్, నరేష్ ముదిరాజ్, చారి, సిద్ధిక్నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్, కాలనీ వాసులు నందు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

