గోల్నాక : నియోజకవర్గంలోని రహదారులకు ఇరు వైపుల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. హార్టికల్చర్ కొత్త డీడీగా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవితో కలసి ఆయన మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు.
అంబర్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి తాసిల్దార్ కార్యాలయం మీదుగా సీపీఎల్ రహదారిలో నాటిన మొక్కల సంరక్షణను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంబర్‌పేట స్విమ్మింగ్‌పూల్, అనంతరామ్నగర్ కాలనీ పార్క్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు సుధాకర్, సువర్ణ, శ్వేత, టీఆర్ఎస్ నాయకులు దిలీప్, మహేష్, గోపాల్‌గౌడ్, రాము, భీంరాజ్, ప్రవీణ్, సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.