ప్రతి రైస్ మిల్లులో కేసీఆర్ చిత్రపటం

రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 8 : కరువు ప్రాంతం జనగామ జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తూ రైతులు, రైస్ మిల్ నిర్వాహకులకు చేతినిండా పని కల్పిస్తున్న సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ప్రతి రైస్ మిల్లులో ఏర్పాటు చేసుకోవాలని జిల్లా రైస్ మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైష్ణవి గార్డెన్లో బెలిదె వెంకన్న అధ్యక్షతన జనగామ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2021-23 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తోట సంపత్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, దుబ్బ రమేశ్, పజ్జూరి జయహరి హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పెద్ది వెంకటనారాయణగౌడ్, కార్యదర్శిగా బెలిదె సతీశ్, కోశాధికారిగా గాదె శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా జొన్నల సోమేశ్వర్, లంక మురళీధర్, సహాయ కార్యదర్శిగా మర్యాల లక్ష్మీనారాయణ, బజ్జూరి కృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులుగా జిల్లా హరికిషన్, దొంతుల రాజు, రాచర్ల లక్ష్మణ్, దాంశెట్టి రామయ్య ఎన్నికకాగా వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
నాలుగురోజులు మార్కెట్ యార్డు బంద్
జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 8: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనెల 11 నుంచి 14 వరకు వరుసగా నాలుగు రోజులు వ్యాపార లావాదేవీలు ఉండవని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాల్దె విజయ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11న సాధారణ సెలవు ఆదివారం, 12న అమావాస్య, 13న ఉగాది పండుగ, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందని తెలిపారు. రైతులు సరుకులను ఈనెల 15న యార్డుకు తీసుకురావాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో కరోనా విజృంభణ..భారీగా పెరిగిన కేసులు
బాలికపై లైంగిక దాడి : ఖాకీ సహా నలుగురు అరెస్ట్
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

