వారానికో రోజు చేనేత వస్త్రాలు ధరించుదాం

కొండాపూర్ : పని చేస్తుంది ఇంటి నుంచైనా ఆఫీసు నుంచైనా ఇంకెక్కడి నుంచైనా సరే ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి ఊతమిద్దామని తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్‌ఎమ్‌సీ) ప్రతినిధి సత్యనారాయణ మథాల అన్నారు.
మాదాపూర్ ఐటీ కారిడార్‌లోని ఫీనిక్స్ ఏరీనాలో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఐటీ, ఈ అండ్సీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం, హైసా, ఎస్సీఎస్సీ, టెస్కోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17వ ఐటీ చేనేత మేళా ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత రంగానికి చేయూతనిచ్చేలా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిద్దామని తెలిపారు. ఐటీ ఉద్యోగులు విధులు ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నా సరే వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు తోడ్పాడలన్నారు.
ఈ మేళాలో అన్ని రకాల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మాస్కులు, గద్వాల్, పోచంపల్లి, సిద్దిపేట, ఇక్కత్ పట్టు చీరలు, హస్తకళ ఉత్పత్తులు, హ్యాండ్లూమ్, జూట్ బ్యాగ్‌లు, కలంకారీ బెడ్షీట్లు, డ్రైస్ మెటీరియల్స్, కాటన్ చీరలు, కుప్పడం పట్టు చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు.

Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

