బీపీ మండల్ సిఫార్సుల అమలుకు కేసీఆర్ కృషి : జూలూరు గౌరీశంకర్

ముషీరాబాద్: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీపీ మండల్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు మేలు చేసేలా పంపిన ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయన్నారు. “ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో” కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రముఖ ఉద్యమకారుడు బీపీ మండల్ జయంతి సభ చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ మండల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడులో అమలు చేస్తున్న విధంగానే మన రాష్ట్రంలో మండల్ స్పూర్తిగా రిజర్వేషన్లు అమలు చేస్తానని సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించారని అన్నారు. బీసీల జీవితాల్లో సంపూర్ణమైన సామాజిక మార్పురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంపాదకుడు బైసా దేవదాసు, రచయిత వడ్డెపల్లి కృష్ణ, టీవీ నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

