Alternative crops| రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలి : కలెక్టరు అమోయ్ కుమార్

కందుకూరు : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడుతూ, ఆరుతడి పంటను వేసుకోవాలని ఆయన సూచించారు.
యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వరిని ఎఫ్‌సీఐ (భారత ప్రభుత్వం ) సేకరించడం లేదని తెలిపారు. అందుకోసం యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. ఈ సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని సూచించారు. వరి సాగు చేసే రైతులు పంటలను అమ్ముకునేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

వీటికి బదులుగా ఇతర పంటల సాగును పెంచుకోవాలని సూచించారు. అందుకోసం రైతులను పోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రత్యమ్నాయ పంటలు, వేరు సెనగ, కంది, పెసర, కుసుమలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో కందుకూరు డివిజన్ ఇంచార్జీ ఆర్డీఓ వెంకటాచారి, వ్యవసాయ అధికారి యాదగిరి, ఏఈఓ అర్చన, సర్పంచ్ గౌర ప్రభాకర్, ఎంపీటీసీ రేఖ.వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, నర్సింహ, మల్లేష్, పీఎసీఎస్ డైరెక్టరు వెంకటేష్, రైతులు పల్స జగన్‌గౌడ్, తిరుపతయ్య, వెంకటేష్‌గౌడ్, అంజయ్య, కిరణ్, భిక్షపతి, సత్తయ్యలు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

