వ్యర్థాలను మ్యాన్‌హోళ్లలో వేయవద్దు…

అడ్డగుట్ట : పారిశుద్ద్య కార్మికులకు భద్రత లేకపోతే శుభ్రత లేదని జలమండలి డీఓపీ స్వామి అన్నారు. గురువారం అడ్డగుట్టలో జరిగిన జలమండలి పక్షోత్సవాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్,నగర గ్రంధాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, జలమండలి జీఎం రమణరెడ్డి, డీజీఎం కృష్ణ, సెక్షన్ మేనేజర్ స్రవంతితో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అడ్డగుట్టలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ద్య నిర్వాహణ, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం డీఓపీ స్వామి మాట్లాడుతూ…మ్యాన్హోళ్ళల్లో మనం నిత్యం వాడే షాంపూ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, బట్టలు, దిండ్లు, పరుపులు, పాలిథీన్ కవర్లు, సీసాలు, గాజు ముక్కలు వేయవద్దని అన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు పారిశుద్ద్య నిర్వాహణపై అవగాహనను పెంచుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ… ప్రజలకు ఎప్పటికప్పుడు పారిశుద్ద్యంపై అవగాహనను కల్పించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మ్యాన్‌హోళ్లలో వ్యర్థాలను విచ్చలవిడిగా వేయడం ద్వారానే డైనేజీ సమస్య తలెత్తుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస నాయకులు నక్కమధు, మనోహర్, పొన్నాల రాజు, వడ్లూరి రవితో పాటు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

