Children’s Vaccination | విద్యార్థులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

హయత్‌నగర్ : 15 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు, యువతీయువకులు తప్పకుండా కొవిడ్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. మంగళవారం హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆధార్ కార్డు నెంబర్లతో స్మార్ట్ ఫోన్లలో యాప్ డబ్ల్యుఐఎన్ ద్వారా కొవిడ్ టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సహకారంతో ప్రభుత్వ జూనియర్, ప్రైవేట్ కళాశాలల్లో వైద్య సిబ్బంది ద్వారా కొవిడ్ టీకాలు వేయించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
సరూర్‌నగర్, హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి గురువారం నుండి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మొదటి దశలోనే ప్రతిఒక్కరూ కొవిడ్ టీకాలు తప్పకుండా వేయించుకుని కరోనా నియంత్రణకు కృషిచేయాలన్నారు.
హయత్‌నగర్‌లోని 740 మంది విద్యార్థులకు ఒకటి, రెండు రోజుల్లో వ్యాక్సిన్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 50వేల మంది విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించామని, పూర్తిస్థాయిలో అందరికీ వ్యాక్సిన్ వేయించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
మొదటి డోసు తీసుకున్న విద్యార్థులు 28 రోజుల అనంతరం సెకండ్ డోసు తీసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కళాశాలలోని మంచినీటి సమస్య, విద్యుత్, ఫ్లోరింగ్ సమస్యలు, లెక్చరర్ నియమానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు సామ తిరుమలరెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

