అంబర్‌పేట : అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన కాపరవేని నర్సింగ్‌రావు కొవిడ్ సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత సమస్య మూలంగా అతనికి ఆపరేషన్ చేసి స్టంట్స్ వేశారు.
మందులు కొనేందుకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఈ విషయం తెలిసిన అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వెంటనే స్పందించారు. తన సొంత ఖర్చులతో మందులు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ మేరకు శుక్రవారం భరత్‌నగర్‌లోని నర్సింగ్‌రావు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అతన్ని పరామర్శించి రూ.12వేల విలువ చేసే మందులను అందజేశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.