Parks development | పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

వనస్థలిపురం : నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయనగర్ పార్కులో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లలో చాలా పార్కులను అభివృద్ధి చేశామన్నారు. హెచ్ఎండీఏ నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి థీమ్ పార్కులను నిర్మించడం జరిగిందన్నారు. రూ.40లక్షలతో సెక్టార్2 పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు.
థీమ్ పార్కుల అభివృద్ధిలో భాగంగా రూ.80లక్షలు అదనంగా కేటాయించడం జరిగిందన్నారు. ఆహ్లాదాన్ని పంచడంతోపాటు, వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.చిన్నా, పెద్దా కుటుంబమంతా సేదతీరే విధంగా పార్కులను రూపొందిస్తున్నామన్నారు.
అందమైన పువ్వులు, ఆకర్షణీయమైన చెట్లు, వాటర్ పౌంటేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటిరెడ్డి అరవింద్‌రెడ్డి, త్రినేత్రాంజనేయ దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్‌గౌడ్, ఉమేష్‌గౌడ్, మాధవరం నర్సింహ్మారావు, రాఘవేందర్‌రెడ్డి, పోగుల రాంబాబు, అశోక్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, నరసరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

