శివలింగం ఎంత ఉండాలి?
శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవారు, మహావిష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరి ఉంటారు.
- ధర్మ సందేహం
ఇంట్లో పూజించే శివలింగం ఏ పరిమాణంలో ఉండాలో తెలియజేయండి?
– రామ్మోహన్, హైదరాబాద్
శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవారు, మహావిష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరి ఉంటారు. మూడు శక్తుల సమ్మేళనం అయిన శివలింగాన్ని నిత్యం పూజించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. అయితే మన బొటన వేలు కంటే చిన్నదైన శివలింగాన్ని పూజించడం శ్రేష్ఠం. సాలిగ్రామ లింగాలు ఎంత చిన్నవి అయితే అంత మంచిది. నిత్యపూజ, ధూపదీప నైవేద్యాలు సక్రమంగా నెరవేర్చుతూ ఉండాలి. నిత్యం అభిషేకం చేయాలి. సాధ్యంకాని రోజుల్లో శివలింగం మునిగే వరకు నీరుపోసి ఉంచాలి.
…?శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

