కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. చాలామంది గొప్పల కోసం దానాలు చేస్తుంటారు. అయితే, చేసిన దానం చెప్పుకొంటే దాని ఫలితం పోతుందని పెద్దల మాట. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది యయాతి కథ. యయాతి తపోనిష్ఠ, దానధర్మాలు ఆయనకు ఇంద్ర పదవిని కట్టబెట్టాయి. ఆయనను ఇంద్రసభకు తీసుకువెళ్లడానికి సప్తర్షులు వచ్చారు.
పల్లకీలో కూర్చున్నాడు యయాతి. సప్తర్షులు పల్లకిని మోస్తూ కదిలారు. యయాతిలో అహంకారం మొదలైంది. విచక్షణ కోల్పోయాడు. అప్పటివరకు తను చేసిన దానాల గురించి, యజ్ఞాల గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించాడు. దాంతో స్వర్గానికి చేరుకోవడానికి ముందే యయాతి పల్లకి నుంచి కింద పడిపోయాడు. అతనికి ఇంద్ర పదవి అందని ద్రాక్షే అయింది.
– శ్రీ