Dussehra | దసరా నాడు పాలపిట్టను ఎందుకు చూస్తారు?
Dussehra | విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు.
Dussehra | దసరా నాడు పాలపిట్ట ( Indian roller aka palapitta )ను ఎందుకు చూస్తారు?
– నవాత్ శ్రీనివాస్, రామాయంపేట
విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. దసరా నాడు సీమోల్లంఘనం చేసి (గ్రామశివారు దాటి) ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శమీవృక్షాన్ని దర్శించి దసరా వేడుకను ఉత్సాహంగా చేసుకుంటారు. తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయల్దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మిచెట్టును పూజించి, దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందన్న కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈ మేరకు దసరా నాడు విజయోత్సాహానికి సూచకంగా శమీ వృక్షాన్ని పూజించి, సీమోల్లంఘనంతోపాటు పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఏర్పడింది.
డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
Read More :
బాసర ఒక్కటే కాదు.. తెలంగాణలో ఉన్న ఈ సరస్వతీ దేవాలయాల గురించి తెలుసా !!”
“దసరాకు ఏ రాష్ట్రం ఎన్ని రోజులు సెలవులు ఇస్తుందో తెలుసా!!”
ముంబై, కోల్‌కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో వస్త్రంలో ఎందుకు దర్శించుకోవాలి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

