శుభప్రదం.. శంఖనాదం
హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది.
హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యాన్ని పూరిస్తాడు. అలా అధర్మం మీద యుద్ధం ప్రకటించడానికి శంఖం పూరించడం అనేది ఓ పదబంధంగా మారిపోయింది. ఇక ఆయుర్వేదం ప్రకారం శంఖాన్ని ఊదటం శరీరంలో వాత, కఫ దోషాలను సమతూకంలో ఉంచుతుంది. శ్వాసను నియంత్రించడం ద్వారా ఇది మన శరీర శక్తిని సమన్వయపరుస్తుంది. దీంతోపాటు శంఖనాదం పరిసరాలను శుద్ధిచేస్తుంది. సానుకూల శక్తి తరంగాలను ఉత్పత్తి చేసి ప్రతికూలతలను తొలగిస్తుంది.
ప్రయోజనాలు
- శంఖనాదంతో ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి సరైన పద్ధతిలో, దాన్ని తగిన విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది.
- మొదటగా శంఖాన్ని మీరు బాగా ఉపయోగించే చేతితో గట్టిగా పట్టుకోవాలి. గాలి ప్రవాహాన్ని నియంత్రించేలా పట్టు ఉండేలా చూసుకోవాలి. రెండో చివరను పైకి ఎత్తి ఉంచాలి.
- తర్వాత ముక్కుతో ఊపిరితిత్తులు పూర్తిగా నిండిపోయేలా దీర్ఘంగా శ్వాసించాలి. ఇది మీకు శంఖాన్ని పూరించేందుకు తగిన గాలిని సమకూరుస్తుంది.
- ఆ తర్వాత మొదటి కొసను పెదవులకు ఆనించి ఊదడం ప్రారంభించాలి. అయితే గాలి ఊదే క్రమంలో గాలిని మీ బుగ్గల నిండా నింపేయవద్దు. ఊపిరితిత్తుల నుంచి శంఖంలోకి వెళ్లేలా చూసుకోవాలి.
- ఇలా నెమ్మదిగా, స్థిరంగా ఊదుతూ శంఖనాదాన్ని పెంచుతూ పోవాలి. ఈ క్రమంలో ఊపిరితిత్తులు, ముఖం కండరాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.
- శంఖం ఊదేటప్పుడు స్థిరమైన లయ, దీర్ఘమైన శ్వాస కొనసాగేలా చూసుకోవాలి. ఇలా చేస్తే నాదంలో నాణ్యత ఉంటుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
- ఇలా రోజూ సాధన చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస ప్రభావవంతంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం
సమకూరుతుంది. - ఇక శంఖాన్ని పూరించేటప్పుడు నోటిద్వారా శ్వాసించకూడదు. ముక్కు ద్వారానే శ్వాసించాలి.
జాగ్రత్తలు
- చిన్నపిల్లలు తమంతట తాముగా శంఖనాదం చేయకూడదు. పెద్దల నుంచి నేర్చుకున్న తర్వాతే శంఖం ఊదాలి. సరిగ్గా చేయకపోతే డయాఫ్రం (ఉదర వితానం), కర్ణభేరి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది.
- అంతేకాకుండా హెర్నియా (వరిబీజం) సమస్య ఉన్నవాళ్లు, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు కూడా సుదీర్ఘకాలం పాటు శంఖనాదం చేయకూడదు.
– శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

