సంక్రాంతి నిలబెట్టడం అంటే..!
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి నెలలకు పేర్లు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి నెలరోజుల ముందు మొదలవుతుంది. దక్షిణాయనంలో ధనుర్మాసం చివరిది. ఈ కాలంలో సూర్యుడి ప్రభావం భూమిపై చాలా తక్కువగా ఉంటుంది
ధనుర్మాసంలో సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
– శ్రీపతి, హైదరాబాద్
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి నెలలకు పేర్లు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి నెలరోజుల ముందు మొదలవుతుంది. దక్షిణాయనంలో ధనుర్మాసం చివరిది. ఈ కాలంలో సూర్యుడి ప్రభావం భూమిపై చాలా తక్కువగా ఉంటుంది. చలి తీవ్రత అధికం అవుతుంది. ఆరోగ్యకారకమైన సూర్యరశ్మి పరిమితంగా లభించే సమయం ఇది. ఫలితంగా అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతి (సూర్యుడు మకరంలోకి సంక్రమించే పర్వం) వరకు చలితీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మన పెద్దలు హెచ్చరించారు. దీన్నే సంక్రాంతి నిలబెట్టడంగా పేర్కొన్నారు. అంతేకాదు ధనుర్మాసంతో చాంద్రమానం అంతర్గతంగా వచ్చే పుష్యమాసం ముడిపడి ఉంటుంది.
పుష్యమి నక్షత్రానికి అధిపతి శనైశ్చరుడు కావడంతో ఈ నెలను శూన్యమాసంగా పరిగణిస్తారు. ఇలా శని ప్రభావం అధికంగా ఉండటం, సంక్రాంతిని నిలబెట్టిన నెల రోజులను పీడ దినాలుగా భావించడంతో ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. ఇక శనైశ్చరుడి అనుగ్రహం కోరుతూ ఈ నెలలో నువ్వులు దానం చేయాలని సూచించారు పెద్దలు. ఇలా దానం ఇవ్వమని చెప్పడంలోనూ గొప్ప ఆంతర్యం కనిపిస్తుంది. చలి అధికంగా ఉండే ఈ సమయంలో నువ్వులూ, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి పుట్టి, చలి నుంచి రక్షణ కలుగుతుంది. నువ్వులు కొనలేని బీదసాదలకు వాటిని దానం ఇవ్వడం అంటే.. వారికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చినవాళ్లం అవుతాం! నువ్వులతోపాటు దుస్తులు దానం ఇవ్వడం కూడా చలి నుంచి వారికి రక్షణ కల్పించడానికే!!
- డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

