Devotional | తీర్థం, క్షేత్రాల మధ్య భేదం ఏమిటి?
– భార్గవ్, కొత్తగూడెం
నదులు, సముద్ర తీరంలో వెలిసిన ఆలయాలు తీర్థాలు. గోదావరి తీరంలోని కాళేశ్వరం, భద్రాచలం, గంగానది ఒడ్డున ఉన్న వారణాసి, సముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణం, రామేశ్వరం తదితర పుణ్యధామాలు తీర్థాలకు ఉదాహరణ. నది, సముద్రం లేకుండా కొండలపై, నేలపై వెలసిన ఆలయాలు క్షేత్రాలు. కొండలపై ఉన్నవాటిని గిరి క్షేత్రాలనీ, నేలపై ఉన్నవాటిని స్థల క్షేత్రాలనీ పిలుస్తారు. తిరుమల, యాదగిరిగుట్ట మొదలైనవి గిరి క్షేత్రాలు. కొన్ని ఆలయాలు నదీతీరంలో కొండలపై ఉంటాయి. వాటిని కూడా క్షేత్రాలుగానే వ్యవహరించాలి. తీర్థం, క్షేత్రం ఏదైనా భగవత్ శక్తి కేంద్రాలే!