Sri Ramanavami Special | శ్రీ రామతత్వమ్ మనకు ఏం బోధిస్తున్నది?
Sri Ramanavami Special | పుడమి జీవుల తపః ఫలితంగా జన్మ ఎత్తితే, అతను ఆర్యుడు. వైదిక క్రతువులు, మత సహనం క్షీణించి, వైరభక్తి, దంభం, ప్రగల్భం, లౌల్యం రాజ్యమేలుతున్న వేళలలో, ఇక్ష్వాకు వంశోద్ధరణ కోరి, పుణ్య చరితుడైన దశరథుడి పుత్రేచ్ఛ కారణంగా జన్మ ఎత్తిన ఆర్యపుత్రుడు శ్రీరాముడు. త్రేతలో సంఘటిల్లిన ఒక అనివార్య సందర్భమే శ్రీరామ జననం.
Sri Ramanavami Special | పుడమి జీవుల తపః ఫలితంగా జన్మ ఎత్తితే, అతను ఆర్యుడు. వైదిక క్రతువులు, మత సహనం క్షీణించి, వైరభక్తి, దంభం, ప్రగల్భం, లౌల్యం రాజ్యమేలుతున్న వేళలలో, ఇక్ష్వాకు వంశోద్ధరణ కోరి, పుణ్య చరితుడైన దశరథుడి పుత్రేచ్ఛ కారణంగా జన్మ ఎత్తిన ఆర్యపుత్రుడు శ్రీరాముడు. త్రేతలో సంఘటిల్లిన ఒక అనివార్య సందర్భమే శ్రీరామ జననం.
విధిని అనుసరించి మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్న మానవీయ, మహనీయమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఉత్తమ కుమారుడిగా, ఆదర్శ సోదరుడిగా, ధర్మ స్వరూపి అయిన భర్తగా, జీవకారుణ్య స్ఫూర్తిగా, అరణ్య జీవన రక్షకుడిగా, అధర్మ విదార శక్తిగా, అయోధ్య పాలకుడిగా, స్నేహబాంధవుడుగా, స్మిత పూర్వక సంభాషణా విన్నాణ మూర్తిగా, ధర్మాన్ని, సత్యాన్ని ఆలంబన చేసుకుని, అవనీ సంచారాన్ని ఆనంద గీతికగా ఆవిష్కరించిన పురుషోత్తముడు రాముడు! దశావతారాలలో ఏడోదిగా, నక్షత్ర మాలలోనూ ఏడోది అయిన పునర్వసు పుణ్యరాశిగా ఆరాధనీయుడి అవతరణ రాముడు.
భూమండలిపై సాగిన అద్భుత చారణ! వశిష్ఠ మహర్షితో సాగించిన గోష్ఠితో మనసు మర్మాన్ని ఎరిగి, విశ్వామిత్ర సారథ్యంలో మంత్రబలాన్ని గ్రహించి, తాటక సంహారంతో తామస గుణాన్ని జయించి, అహల్య శాప విమోచనంతో రాజసాన్ని అధిగమించి, సీతా కల్యాణ వైభోగంతో సత్వగుణాన్ని అందుకుని, పూర్ణ మానవత్వానికి పట్టం కట్టిన మహనీయుడు రాముడు!

పట్టాభిషేక ఆనంద క్షణాలలో ఎదురైన ఆశాభంగాన్ని స్థితప్రజ్ఞతతో జయించాడు. అడవుల వైపు నడక సాగించినా, దశరథుని మరణానంతరం తన తండ్రికి మిత్రుడైన జటాయువుకు అంత్యేష్టి, అంటే అగ్నిసంస్కారం జరిపాడు. పగలంతా దుష్ట సంహార క్రీడ సాగించి, రాత్రులన్నీ మహర్షుల సన్నిధిలో గడిపాడు. కాంతారవాసాన్ని ఫలప్రదం చేసుకున్న ధర్మ సంరక్షణా దీక్షా దక్షతతో వాలిని సంహరించాడు. సుగ్రీవమైత్రిని సాధించుకుని, హనుమశక్తిని తన శక్తిలో ఇముడ్చుకుని, రావణ సంహారం తర్వాత మాతృమూర్తి, మాతృదేశాన్ని మించి వేరు స్వర్గం లేదని ప్రకటించిన యథార్థ జ్ఞాని శ్రీరాముడు!
దాంపత్య ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను, సోదర ప్రేమను, రాజధర్మాన్ని, ప్రజానురంజక పాలనను, వేద ధర్మాన్ని తన జీవన విధానం ద్వారా పరిపుష్టం చేసిన లలిత మర్యాదుడు శ్రీరాముడు! ఆజన్మ శుద్ధుడు శ్రీరాముడు. యజ్ఞం, దానం, త్యాగం కలిసినదే భారతీయ సంస్కృతి. ఫలితం లభించే వరకూ పనిచేస్తూ, లోకసంరక్షణకై యజ్ఞ నిర్వహణను చేస్తూ, అర్హులైన వారికి దానం చేస్తూ, దారితప్పిన వారికి దండన విధిస్తూ, నిరంతరం అప్రమత్తతతో మెలుగుతూ, మితభాషణం చేస్తూ, ధర్మాన్ని కవచంగా ధరిస్తూ, విధి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ, జీవితానికి సంపూర్ణత్వాన్ని సంతరించిన ఉదాత్తుడు శ్రీరాముడు. ఇంద్రియాతీత భావనే ఆనందం! అది మూర్తిమంతమైతే, అవ్యాజ కరుణే స్వభావమైతే, అతిమానుష చర్యలే దివ్యశక్తులైతే, రామరాజ్యం సర్వదా ఆదర్శమైతే, నవోజ్వల శీలమే గుణమైతే, పరాశక్తిని పరిణయమాడగల ధీశక్తి సహజశక్తి అయితే, దేశ, కాల బద్ధత్వమే బుద్ధత్వమైతే, ఆసేతు శీతాచలం ధర్మ, కర్మ, తపో, యాగ, యోగ, ధ్యాన భూమి అయితే, అదే రామత్వమ్. అదే శ్రీరామతత్వమ్!
– వి.యస్.ఆర్.మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
Read More :
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

