అమ్మవారి పుష్పవిలాసం
‘పుష్పైర్దేవాః ప్రసీదంతి..’ పుష్పాల ద్వారా దేవతలు ప్రీతి చెంది మనిషి కోరుకునేవిల భింపజేస్తారు. ‘త్రివర్గసాధనం పుష్పం.. పుష్టి-శ్రీ-స్వర్గమోక్షదమ్'పువ్వులు పుష్టిని, సంపదలను,స్వర్గాన్ని ప్రసాదిస్తాయి. ప్రతీపూజలోనూ పువ్వులుంటాయి. పంచేంద్రియాలలో ముఖ్యమైన మూడింటిని ఆహ్లాదపరిచే ప్రకృతి వరం పువ్వులు. కంటికి ఇంపు, స్పర్శకు మృదువుగా, ముక్కుకి సువాసన చేకూర్చే పువ్వులు మనస్సుకు తెలియని అనుభూతిని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
‘పుష్పైర్దేవాః ప్రసీదంతి..’ పుష్పాల ద్వారా దేవతలు ప్రీతి చెంది మనిషి కోరుకునేవిల భింపజేస్తారు. ‘త్రివర్గసాధనం పుష్పం.. పుష్టి-శ్రీ-స్వర్గమోక్షదమ్’పువ్వులు పుష్టిని, సంపదలను,స్వర్గాన్ని ప్రసాదిస్తాయి. ప్రతీపూజలోనూ పువ్వులుంటాయి. పంచేంద్రియాలలో ముఖ్యమైన మూడింటిని ఆహ్లాదపరిచే ప్రకృతి వరం పువ్వులు. కంటికి ఇంపు, స్పర్శకు మృదువుగా, ముక్కుకి సువాసన చేకూర్చే పువ్వులు మనస్సుకు తెలియని అనుభూతిని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
మొగ్గగా మొదలై పుష్పంగా వికసించి పరిమళాన్ని పంచి, చివరకు నేలరాలే పువ్వు.. మనిషి జీవితానికి కూడా ఒక అందమైన ప్రతీక. పుట్టుక, వికాసం, సేవ, త్యాగం ఈ నాలుగు దశలను ఒక్క పుష్పం తన జీవితకాలంలోనే నిశ్శబ్దంగా బోధిస్తుంది. దేవీమహాత్మ్యంలో జగన్మాతను సకల జీవులలో చైతన్యరూపిణిగా, శక్తిరూపిణిగా, దయారూపిణిగా స్తుతిస్తారు. ఈ దృష్టితో చూస్తే పువ్వు కూడా అమ్మవారి సృష్టిశక్తికి ప్రతిబింబమే. నేలలోని పోషకాలు, నీటిలోని జీవధార, సూర్యకాంతి, గాలి, కాలగమనాల సమన్వయంతో ఒక పుష్పం రూపుదిద్దుకుంటుంది. పువ్వును అమ్మవారికి సమర్పించడం అంటే ప్రకృతి ప్రసాదించిన సౌందర్యాన్ని కృతజ్ఞతతో తిరిగి ఆ ప్రకృతికి మూలాధారమైన జగదాంబకే అర్పించడమని పుష్పార్చనలో చెబుతాం.
లలితామహా త్రిపురసుందరి అమ్మవారిని
‘అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం..’ అంటూ ధ్యానిస్తాం. అరుణ వర్ణంతో, కరుణతో నిండిన నేత్రాలతో, పాశం, అంకుశం, పుష్ఫబాణాలు, చెరకు విల్లు ధరించి, దివ్యకాంతులతో విరాజిల్లే భవానిని ధ్యానిస్తున్నామని ఈ శ్లోకం చెబుతుంది. ఇందులోని పుష్పబాణాలు ప్రత్యేకం. అమ్మవారి చేతిలోని పుష్పాలు కేవలం సౌందర్యానికి మాత్రమే సంబంధించినవి కావు. పుష్పవిలాసం అంటే పూలతో చేసే అలంకరణ మాత్రమే కాదు.. అది ప్రకృతిలో పరాశక్తి ఆవిష్కరణ. లలితాపరమేశ్వరికి జాజి, చంపక, కుంద, కేసర, శిరీష వంటి ముఖ్య కుసుమాలంటే చాలా ఇష్టం. వాటినే ఆమె శిరోజాలలో అలంకరించుకుంటుంది.
మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ అంటూ అమ్మవారి లలితాసహస్ర నామాల్లో ధ్యానిస్తాం. కదంబ వనాలలో సంచరిస్తూ కదంబ పువ్వులను అలంకరించుకుని ఎర్రని, గుండ్రని, చిన్నచిన్న పూలు వికసించే వర్షాకాలపు జల్లులతో ఆ పుష్పాల మధువులను గ్రోలుతూ ఉంటుంది. ఇది సాధారణ ప్రకృతి వర్ణన కాదు. శ్రీవిద్యా సంప్రదాయంలో దివ్యలోక వైభవాన్ని, పరాశక్తి నివాస మహిమను ఈ వర్ణనలు ఆవిష్కరిస్తాయి.
ఎర్రని మందారం అమ్మవారికి, మహాశివుడికి మహాప్రీతికరమైన పుష్పం. ఐదురెక్కలతో ఎర్రగా, హుందాగా ఉన్న ఈ పుష్పం మూలాధారచక్రాన్ని వ్యక్తం చేస్తుంది. అమ్మవారి స్థానం ఎరుపు. ఆ పువ్వులోంచి కాడ నిటారుగా ఉండి చుట్టూ ఐదు చిన్న బొడిపెలుంటాయి. ఈ ఐదు రెక్కలు, బొడిపెలు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు ప్రతీక. శక్తిని అంటే మూలాధారాన్ని శివంతో అంటే ఆజ్ఞా చక్రంతో కలిపితేనే సృష్టి. అరుణకిరణాలతో వికసించే మందారం అమ్మవారి ఉగ్రశక్తిని, వీరత్వాన్ని గుర్తు చేస్తే , తెల్లని మల్లె ప్రశాంతతను, నిర్మలత్వాన్ని స్ఫురింపజేస్తుంది.
కమలం బురదలో పుట్టినా తన స్వచ్ఛతను కాపాడుకుంటుంది. అందుకే అది ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీకగా నిలుస్తుంది. సంపెంగ, పారిజాతం వంటి పుష్పాలు తమదైన పరిమళంతో పూజకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. అయితే ప్రతీ పువ్వుకూ ఒకే అర్థం, ప్రతీ దేవతకూ ఒక పుష్ప నియమం ఉండదు. పుష్ప సమర్పణలో సంప్రదాయం, ప్రాంతీయ ఆచారం, ఆగమ విధానం లాంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. పూలరంగులు, వాటి ప్రతీకాత్మక అర్థాలు కూడా సంప్రదాయాన్ని బట్టి మారవచ్చు. కానీ వీటన్నిటినీ కలిపే అంతరార్థం ఒక్కటే.. ప్రకృతి ప్రసాదించిన సౌందర్యాన్ని కృతజ్ఞతతో దైవానికి సమర్పించడం.
భారతీయ పూజా సంప్రదాయంలో ద్రవ్య సమర్పణకు, మంత్రోచ్చారణకు విడివిడిగా ప్రాధాన్యముంది. పుష్పం పూజాద్రవ్యం. లలితాంబికను పుష్పాలతో అలంకరించడం ఆమె వైభవాన్ని దర్శించడానికి ఒక మార్గం. అమ్మవారి అలంకరణలో పూల అమరిక ఒక ప్రత్యేకమైన కళ. రంగుల సమతౌల్యం, పుష్పాల పరిమాణం, పరిమళాల వైవిధ్యం, దేవతా స్వరూపానికి తగిన అలంకరణ.. ఇవన్నీ కలిసినప్పుడు భక్తుడి మనసులో ఒక అందమైన దృశ్యానుభూతి ఏర్పడుతుంది.
భారతీయ ఆరాధనా సంప్రదాయంలో రూపం, రంగు, గంధం, శబ్దం వంటి ఇంద్రియానుభవాలకు స్థానం ఉండటానికి ఇదొక ఉదాహరణ. పూల అలంకరణ మనసును ప్రశాంతపరిచి ఆరాధనలో ఏకాగ్రతను పెంచేందుకు దోహదం చేస్తుంది. లలితాంబిక పుష్పాలంకరణలో ఎరుపు, గులాబీ, తెలుపు వంటి వర్ణాలు భక్తుల మనసులో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఏ వర్ణం కలిగిన పుష్పం సమర్పించాలనే విషయం సంప్రదాయాన్ని, ఆచారాన్ని బట్టి మారుతాయి. పలు దేవతార్చనలో పుష్పం ముఖ్యమైనది కాగా కొన్ని పుష్పాలు ప్రత్యేక అర్చనా పద్ధతులకు ప్రధానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే గ్రహశాంతి చేసేవారు కూడా ఒక్కొక్క గ్రహ దేవతకు ఒక్కొక్క వర్ణపూలతో అర్చన చేసే విధానం కనిపిస్తుంది.
పుష్పం ఒక భక్తుడి భావాన్ని వ్యక్తం చేసే మౌనభాషకు ప్రతిరూపం. మంత్రోచ్చారణలో మంత్రాలు ఉంటాయి. స్తోత్రపఠనంలో నామాలు ఉంటాయి. పుష్పసమర్పణలో మాత్రం ఒక భావాన్ని చేతుల ద్వారా పువ్వుల రూపంలో వ్యక్తం చేస్తాం. లలితాత్రిపురసుందరి ఆరాధనలో పుష్పాలతో కూడిన సహస్రనామార్చన ఈ ప్రత్యేకమైన అనుభూతికి నిదర్శనం. ప్రతీ నామాన్ని స్మరిస్తూ అమ్మవారి పాదాల చెంత ఆమె దివ్యగుణాలను ధ్యానిస్తూ సమర్పించిన పుష్పం భక్తుడి ఉపాసనలో భాగమవుతుంది. పుష్పం నామానికి సహచరమవుతుంది. నామం భావానికి ఆలంబన అవుతుంది. భావం ఉపాసనకు లోతును అందిస్తుంది. అందుకే సృష్టి వైభవానికి మూలమైన జగన్మాతగా, పుష్పంలోనూ, వనంలోనూ దివ్యత్వాన్ని దర్శింపజేసే పరాశక్తిగా అమ్మవారిని పూజించాలి. ఆమె పాదాలకు భక్తుడు చేసే పుష్పార్చన శ్రీవిద్యా సంప్రదాయంలో అమ్మవారి పుష్ప విలాసానికి సంబంధించిన అద్భుతమైన ఆధ్యాత్మిక సందర్భం.
రంగనాథ్ మిద్దెల
9866573461
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

