Ramadan | రంజాన్ నెలలో ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?
ఒకానొకసారి రంజాన్ నెలలో మక్కా ఇమామ్‌కు ఓ ఆఫ్రికా వ్యక్తి ఫోన్ చేసి ‘సహెరీ, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?’ అని అడిగాడు. అతని మాటలకు ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చారు. సహెరీ, ఇఫ్తార్‌లో తినడానికి తిండికి నోచుకోనివారున్నారు.
Ramadan | ఒకానొకసారి రంజాన్ నెలలో మక్కా ఇమామ్‌కు ఓ ఆఫ్రికా వ్యక్తి ఫోన్ చేసి ‘సహెరీ, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?’ అని అడిగాడు. అతని మాటలకు ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చారు. సహెరీ, ఇఫ్తార్‌లో తినడానికి తిండికి నోచుకోనివారున్నారు. ఈ రంజాన్ ఉపవాసాలు పేదల ఆకలి బాధను అనుభవపూర్వకంగా తెలియజేస్తాయి. నిరుపేదలకు ఆకలి రుచి తెలుస్తుంది. మరి సంపన్నులకు ఆకలి గురించి తెలియదు. పేద, ధనిక, ఆడ, మగ అనే తేడాలేకుండా ముస్లింలు నెల రోజులపాటు రంజాన్ రోజాలు పాటించాలన్నది ధార్మిక విధి. ఈ ఉపవాసాలతో ఆకలి బాధ అందరికీ తెలిసి వస్తుంది. దీంతో పేదలపై దయ, జాలి జనిస్తాయి. ఏదైనా అనారోగ్య కారణంతో ఉపవాసాలు పాటించని వారు ఒక ఉపవాసికి సహెరీ, ఇఫ్తార్ చేయించాలన్నది షరియత్ నిబంధన.
ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయించి ఆకలి తీరిస్తే ఉపవాసం పాటించినదానితో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. ఏదైనా కారణంతో ఉపవాస భంగం కలిగితే 60 మంది నిరుపేదలకు అన్నదానం చేసి… దాని పరిహారం చెల్లించాలి. వృద్ధులు, రోగపీడితులు, బాలింతలు, పాలిచ్చే తల్లులకు ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. వీళ్లంతా నెలసాంతం ఉపవాస దీక్ష చేపట్టేవారికి సహెరీ, ఇఫ్తార్ చేయించాల్సి ఉంటుంది. ఈ బోధనలన్నీ సాటి మనిషిపై కరుణను ప్రోత్సహించేవే. మనిషిలో మానవత్వాన్ని, మానవీయ విలువలకు పెద్దపీట వేసేవే. మనిషిలో కాఠిన్యాన్ని నిర్మూలించి కారుణ్యాన్ని పెంపొందించే నిబంధనలు ఇవి.
రంజాన్ నెలలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వాతావరణం ఉంటుంది. అంతా కలసి పక్కపక్కనే కూర్చుని ఇఫ్తార్ చేసే అద్భుత అవకాశం ఉంటుంది. ఇఫ్తార్ వేళ.. ఎదుటివారికి ప్రాధాన్యమివ్వడం గమనించవచ్చు. రంజాన్ నెలసాంతం ముహమ్మద్ ప్రవక్త (స) వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేసేవారు. ‘దైవాన్ని విశ్వసించనంత వరకు మీరు స్వర్గంలోకి ప్రవేశించలేరు, అలాగే ఒకరినొకరు ప్రేమించుకోనంత కాలం మీరు నిజమైన విశ్వాసులు కాలేరు’ అన్న ప్రవక్త ఉద్బోధకు రంజాన్ ఉపవాసాలు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

