Sankranthi Special | సంక్రాంతి పురుషుడు అంటే ఎవరు? ఆయన ఎలా ప్రభావం చూపిస్తారు?
Sankranthi Special | సంక్రాంతి పురుషుడి గురించి ప్రతి ఉగాదికీ పంచాంగ శ్రవణం సందర్భంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి పురుషుడి రూపం, లక్షణాల గురించి సిద్ధాంతులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. సంక్రాంతి పురుషుడి రూపురేఖలు, అధిరోహించిన వాహనం, ధరించిన దుస్తులు, పట్టుకున్న ఆయుధాలు ఇవన్నీ ఆ సంవత్సర ఫలితాన్ని శాసిస్తాయని విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరీ సంక్రాంతి పురుషుడు? ఆయనకు ఎందుకు ఇంత ప్రాధాన్యం తెలుసుకుందాం..
Sankranthi Special | సంక్రాంతి పురుషుడి గురించి ప్రతి ఉగాదికీ పంచాంగ శ్రవణం సందర్భంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి పురుషుడి రూపం, లక్షణాల గురించి సిద్ధాంతులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. సంక్రాంతి పురుషుడి రూపురేఖలు, అధిరోహించిన వాహనం, ధరించిన దుస్తులు, పట్టుకున్న ఆయుధాలు ఇవన్నీ ఆ సంవత్సర ఫలితాన్ని శాసిస్తాయని విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరీ సంక్రాంతి పురుషుడు? ఆయనకు ఎందుకు ఇంత ప్రాధాన్యం తెలుసుకుందాం..
మకర సంక్రాంతి నాటి సూర్యశక్తికే సంక్రాంతి పురుషుడు అని పేరు. సంక్రమణ పర్వదినం సందర్భంగా శుభాశుభాలు తెలియజేసే విధంగా ఆ శక్తి సాక్షాత్కరిస్తుంది. రవి సంక్రమణం జరిగే తిథి, వారం, నక్షత్రాన్ని అనుసరించి సంక్రాంతి పురుషుడి లక్షణాలను, ఆయన అనుగ్రహాన్ని వివరించారు మన పూర్వికులు. మకర సంక్రాంతి నాటి సూర్యశక్తికే సంక్రాంతి పురుషుడు అని పేరు. సంక్రమణ పర్వదినం సందర్భంగా శుభాశుభాలు తెలియజేసే విధంగా ఆ శక్తి సాక్షాత్కరిస్తుంది. రవి సంక్రమణం జరిగే తిథి, వారం, నక్షత్రాన్ని అనుసరించి సంక్రాంతి పురుషుడి లక్షణాలను, ఆయన అనుగ్రహాన్ని వివరించారు మన పూర్వికులు. స్వస్తశ్రీ శోభకృత్ నామ సంవత్సరం పుష్య మాసం శుక్ల తదియ ఉపరి చవితి తేదీ 14-01-2024 ఆదివారం రాత్రి 2-43 గంటలకు తెల్లవారితే సోమవారం అనగా శతభిషం నక్షత్రం మూడోపాదం, వ్యతీపాత యాగం, భద్ర కరణం, వృశ్చిక లగ్నంలో రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రాత్రేవ స్నానదాన పరేహణి అను ప్రామాణిక వచనం అనుసారం మర్నాడు జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. సంక్రాంతి పుణ్యకాలం సోమవారం సూర్యోదయం (6-49) నుంచి సూర్యాస్తమయం (6-01) వరకు ఉంటుంది.
మకర సంక్రాంతి పురుష లక్షణం
సంక్రాంతి పురుషుడి పేరు ద్వాంక్ష కావడం వల్ల వ్యాపారులకు అరిష్టం.
చందనోదక స్నానఫలం-అనుకూల వర్షాలు, సుభిక్షం, ప్రజారోగ్యం.
ముద్రాక్షత ధారణ ఫలం – పెసరపంటలకు నష్టం.
చర్మ వస్త్రధారణ-భయం.
ఖడ్గ ధారణం- యుద్ధ వాతావరణం
సిందూరగంధ లేపనం – సాధజనులకు అరిష్టం
కాంస్య పాత్ర భోజనం – అరిష్టం
పాయసాహారం – ప్రజాక్షయం
బిల్వఫల భక్షణం – అతివృష్టి
అశ్వవాహనం – గుర్రాలకు హాని.
చింతతో కూడిన ముఖం – ప్రజాసౌఖ్యం
మయూర పింఛ ఛత్రం – చిత్రలేఖకులకు అరిష్టం
నివిష్ట చేష్టా ఫలం – సస్యవృద్ధి
ఈశాన్య దిక్కు ప్రయాణించడం – ఈశాన్య ప్రాంతాలకు అరిష్టం
శుక్ల పక్షం – వ్యాధి భయం, యుద్ధ వాతావరణం
చవితి – మిశ్రమ ఫలితాలు
సోమవారం – సుభిక్ష క్షేమారోగ్యం
శతభిషం నక్షత్రం – సువృష్టి
రాత్రి సమయం – సస్యాభివృద్ధి
వృశ్చిక లగ్నం – రాజులకు అరిష్టం
ముహూర్తఫలం – సుభిక్షం
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

