కోపాన్ని జయిద్దాం
కోపం మనిషి విచక్షణను దెబ్బతీస్తుంది. క్షణికావేశంలో పలికే మాటలు మనసులను గాయపరుస్తాయి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపానికి గురిచేయవచ్చు. అయితే కోపాన్ని అణచుకోవడం, క్షమించడం, సహనం పాటించడం, చెడుకు మంచితో సమాధానం ఇవ్వడం లాంటి ఉన్నతమైన గుణాలను ఖురాన్ బోధిస్తుంది. కోపం వచ్చినప్పుడు మనసును అదుపులో ఉంచుకోవడానికి, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడానికి ఖురాన్‌లోని ఈ ఐదు ఆయతులు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

- ఎవరైతే తమ కోపాన్ని అణచుకుంటారో, ప్రజలను క్షమిస్తారో, అటువంటి సత్ప్రవర్తన కలిగిన వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు (ఖురాన్ 3:134). కోపం వచ్చినప్పుడు దాన్ని ఇతరులపై చూపించకుండా అదుపులో ఉంచుకోవడం గొప్ప గుణం. క్షమించడం బలహీనత కాదు; అది ఆత్మనిగ్రహానికి నిదర్శనం.
- వారు కోపానికి గురైనప్పుడు కూడా క్షమిస్తారు(ఖురాన్ 42:37). ఎదుటివారు మనల్ని బాధించినప్పుడు వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించవచ్చు. కానీ, ఆ సమయంలో క్షమించగలగడం మన వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
- చెడును అత్యుత్తమమైన మార్గంతో ఎదుర్కోండి. అలా చేస్తే, మీకు శత్రువుగా ఉన్న వ్యక్తి కూడా సన్నిహిత మిత్రుడిగా మారవచ్చు (ఖురాన్ 41:34). ఒకరు కోపంగా మాట్లాడినప్పుడు మనం కూడా అదే విధంగా స్పందిస్తే వివాదం పెరుగుతుంది. ప్రశాంతంగా, మర్యాదగా సమాధానం ఇవ్వడం ద్వారా పరిస్థితిని మార్చే అవకాశం ఉంటుంది.
- క్షమాపణను అవలంబించండి, మంచిని ఆదేశించండి, అజ్ఞానంగా ప్రవర్తించే వారి నుంచి దూరంగా ఉండండి (ఖురాన్ 7:199). ప్రతీ వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. మనశ్శాంతిని దెబ్బతీసే అనవసరమైన గొడవల నుంచి తప్పుకోవడం కూడా వివేకమే.
- మీరు సహనం పాటిస్తే, సహనం వహించేవారికి అదే ఎంతో శ్రేష్ఠమైనది (ఖురాన్ 16:126). కోపంలో వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవడం, మాటలను అదుపులో ఉంచుకోవడం, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మనకు ఎంతో మేలు చేస్తాయి.
ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య