కమ్మని పాలు.. కరుణించిన దైవం!
మన వంటింట్లో ఉదయాన్నే లీటర్ పాల ప్యాకెట్ కోసమో, పాలవాడి కోసమో ఎదురుచూడటం మనకు అలవాటే. ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పుతోనో, పిల్లలకు ఇచ్చే గ్లాసు పాలతోనో మన రోజు మొదలవుతుంది. అసలు పాలు లేని రోజును మనం ఊహించుకోలేం. అయితే, రోజూ మనం తాగే ఈ తెల్లటి పాల వెనుక ఎంతటి సృష్టి అద్భుతం దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించామా?
ఇస్లాం బోధ
మన వంటింట్లో ఉదయాన్నే లీటర్ పాల ప్యాకెట్ కోసమో, పాలవాడి కోసమో ఎదురుచూడటం మనకు అలవాటే. ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పుతోనో, పిల్లలకు ఇచ్చే గ్లాసు పాలతోనో మన రోజు మొదలవుతుంది. అసలు పాలు లేని రోజును మనం ఊహించుకోలేం. అయితే, రోజూ మనం తాగే ఈ తెల్లటి పాల వెనుక ఎంతటి సృష్టి అద్భుతం దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? పాలు అంటే కేవలం మార్కెట్లో దొరికే ఒక వస్తువు కాదు… అది ప్రకృతి మనకు ఇచ్చిన అమృతం, దైవం కురిపించిన కరుణ. పవిత్ర ఖురాన్ గ్రంథంలో పాలను ఒక గొప్ప దైవిక సంకేతంగా, ఎంతో పవిత్రమైన ఆహారంగా అభివర్ణించారు. మన ఇళ్లల్లో నిత్యం కనిపించే పాల వెనుక ఉన్న ఆ కమ్మని కథేంటో… చూద్దాం!
పాలు ఎలా తయారవుతాయో సైన్స్ పరంగా ఆలోచిస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. పశువుల పొట్టలో ఒకవైపు జీర్ణమైన ఆహార వ్యర్థాలు ఉంటాయి, మరోవైపు ఒళ్లంతా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కానీ, ఈ రెండింటి మధ్య నుంచి ఎక్కడా రక్తం మరక లేకుండా, వ్యర్థాల వాసన రాకుండా… ఎంతో స్వచ్ఛమైన, తెల్లటి పాలు ఎలా వస్తున్నాయి? సరిగ్గా ఇదే అద్భుతాన్ని ఖురాన్‌లోని ‘సూరా అన్-నహ్ల్’ (16:66) అనే వచనం మనసుకు హత్తుకునేలా వివరిస్తుంది. ‘మీకు పశువులలో కూడా ఒక గుణపాఠం ఉన్నది. వాటి గర్భంలో పేడ, రక్తానికి మధ్య ఉన్న ఒక వస్తువును మేము మీకు తాగిస్తాము. అంటే స్వచ్ఛమైన పాలు. అది తాగేవారికి ఎంతో కమ్మనిది’ అని పేర్కొని ఉంది. ఆధునిక సైన్స్ అసలు ఉందో లేదో తెలియని ఆ కాలంలోనే, పశువుల శరీరంలో జరిగే ఈ వింతను దేవుడి అద్భుత సృష్టిగా ఖురాన్ ఆనాడే ప్రపంచానికి చాటిచెప్పింది.
రెండేళ్ల తీపి బంధం!
ఇక కుటుంబంలో అందరి ప్రాణం… ఇంట్లో తిరిగే బుజ్జాయిలే. ఆ పాపాయిలకు తల్లిపాల కంటే మించిన అమృతం ఈ లోకంలో మరొకటి లేదు కదా! ఖురాన్ కేవలం పశువుల పాల గురించే కాదు, ‘అమ్మపాల’ విలువను కూడా ఎంతో పవిత్రంగా గుర్తుచేసింది. ‘సూరా అల్-బఖరా’ (2:233) వచనం ప్రకారం… పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం అనేది ఒక దైవికమైన హక్కు. తల్లిపాల ద్వారా పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యం అందడమే కాకుండా, వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే, వీలైతే రెండు పూర్తి సంవత్సరాల పాటు బిడ్డకు పాలు ఇవ్వాలని ఖురాన్ సూచించింది. ఈ రోజుల్లో డాక్టర్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా కనీసం రెండేళ్ల వయసు వరకు పిల్లలకు తల్లిపాలు అందించాలని నొక్కి చెబుతున్నారు. ఇది తల్లికి, బిడ్డకు మధ్య ఉండే ప్రేమానురాగాల బంధాన్ని మరింత గట్టిగా ముడేస్తుంది.
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

